పెద్దిరెడ్డికి వ్య‌తిరేకంగా మ‌హిళా అభ్య‌ర్ధి పోటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp mla peddi reddy ramachandra reddy
Updated:  2018-09-19 12:13:38

పెద్దిరెడ్డికి వ్య‌తిరేకంగా మ‌హిళా అభ్య‌ర్ధి పోటీ

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లా. ఈ జిల్లాలో 2019లో  హోరా హోరీగా జ‌రిగే ఎన్ని క‌ల్లో టీడీపీ త‌న ప‌ట్టు సాధించాల‌నే ఉద్దేశంతో అధిష్టానం స‌రికొత్త ప్లాన్లు వేస్తుంది. అందులో భాగంగానే చంద్ర‌బాబు పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ త‌ర‌పున కొత్త అభ్య‌ర్ధిని నియ‌మించిన‌ట్లు తెలుస్తోంది.
 
ఈ నియోజ‌క‌వ‌ర్గంలో నాటినుంచి నేటి వ‌ర‌కు టీడీపీకి వ్య‌తిరేకంగానే ఉన్నారు ఇక్క‌డి ప్ర‌జ‌లు. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఇక ఈయ‌న‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడిండ‌చ‌డం క‌ష్ట‌త‌రంతో కూడుకున్న పని. అయినా కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు గ‌ట్టిపోటీ ఇవ్వాల‌ని చూస్తున్నారు టీడీపీ నాయ‌కులు. అందులో భాగంగానే ఫిరాయింపు ఎమ్మెల్యే మంత్రి అమ‌ర్ నాథ్ రెడ్డి కుటుంబానికి చెందిన అనుషా రెడ్డిని పోటీ చేయించాల‌ని చూస్తున్నార‌ట‌. 
 
అనుషారెడ్డి స్వ‌యాన అమ‌ర్ నాథ్ రెడ్డికి మ‌ర‌ద‌లు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో చంద్ర‌బాబు నాయుడు ఆలోచించి అనుషారెడ్డి అయితే పెద్దిరెడ్డికి గ‌ట్టి పోటీ ఇవ్వ‌గ‌ల‌ద‌ని భావించారు. అయితే ఇదే క్ర‌మంలో ఆమె భ‌ర్త‌ను కూడా చంద్ర‌బాబు నాయుడు పిలిపించుకుని పోటీ పై చ‌ర్చించార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనుషారెడ్డి ని ఖ‌చ్చితంగా పోటీ చేయించాల‌ని కోరారట‌. 
 
ఇక ఆయ‌న విజ్ఞ‌ప్తి మేర‌కు ఆమె భ‌ర్త పోటీకి సుముఖ‌త చూపిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో మంత్రి అమ‌ర్ నాథ్ రెడ్డి కూడా ఒత్తిడి తేవ‌డంతో పోటీకి అనుషా అంగీక‌రించారు. చూద్దాం అనుషారెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధిక సంఖ్య‌లో ప్ర‌జా ద‌ర‌ణ ఉన్న పెద్దిరెడ్డి రామ‌చంద్రా రెడ్డికి పోటీ ఇవ్వ‌గ‌ల‌దా లేదా అన్న‌ది ప్ర‌శ్నార్ధ‌కంగా మారుతుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.