బాబు తన ఇంటి ని తానే గుల్ల చేస్తున్నాడా..!

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu
Updated:  2018-10-15 01:18:10

బాబు తన ఇంటి ని తానే గుల్ల చేస్తున్నాడా..!

రాజకీయాలు ఎప్పుడూ ఇలానే ఉంటాయి. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇలాంటి రాజకీయాలు చేయడంలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. బయటికి చూపించే సినిమా ఒకటి ఉంటుంది. వాస్తవంగా జరిగే సినిమా మాత్రం ఇంకొకటి ఉంటుంది. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచిన సమయం....అంతకు ముందు కూడా చంద్రబాబు ఎప్పుడూ చేసిన రాజకీయాలు ఇవే. ఎన్టీఆర్‌కి నమ్మకమైన భక్తుడిలా ఉంటూ ఆయనకే వెన్నుపోటు పొడిచాడు. తన చేతుల మీదుగానే ఎన్టీఆర్-లక్ష్మీపార్వతిల పెళ్ళి జరిపించిన చంద్రబాబు అదే పెళ్ళిని సాకుగా చూపించి ఎన్టీఆర్‌కి ఆయన కొడుకులను దూరం చేశాడు.

అదే లక్ష్మీపార్వతిని సాకుగా చూపి ఏకంగా ఎన్టీఆర్ పార్టీని, అధికారాన్ని కూడా లాక్కున్నాడు. ఆ దిగులుతో ఎన్టీఆర్ చనిపోయాడన్నది వాస్తవం.విభజన సమయంలో కూడా టిడిపిని, తన రాజకీయ భవిష్యత్‌ని నాశనం చెయ్యడానికే విభజన చేస్తున్నారని ప్రజలకు సినిమా చూపించాడు. తెరవెనుక మాత్రం ఎంచక్కా సోనియాతో కలిసిపోయి, చీకట్లో చిదంబరంతో రాజకీయాలు చేసి విభజనకు పూర్తిగా మద్దతిచ్చాడు. ఇప్పుడు సిఎం రమేష్ విషయంలో కూడా అదే రాజకీయం చేస్తున్నాడని న్యాయశాఖ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

తెలంగాణాలో కెసీఆర్‌ని ఓడించడానికి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబును కేసీఆర్ వదిలే ప్రసక్తే లేదు. ఓటుకు కోట్లు కేసులో బాబు ఇరుక్కోవడం ఖాయం కనుక... ఆ ఆపద నుంచి తాను బయటపడడానికి తెర వెనుక వ్యవహారం అంతా సిఎం రమేష్ చేశాడు అని పాపం మొత్తాన్ని సిఎం రమేష్‌కి అంటగట్టాలని చూస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టిడిపికి రాజగురువులాంటి మీడియా అధినేత ఈ వ్యూహం