జూనియర్ ఎన్టీఆర్ ఈ సారి గెలిపిస్తాడా..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jr ntr
Updated:  2018-09-11 01:40:00

జూనియర్ ఎన్టీఆర్ ఈ సారి గెలిపిస్తాడా..?

“అల్లుడు ఆషాఢమాసం లాంటోడు అప్పుడప్పుడు వస్తాడు… మనువడు చెట్టు వస్తే పాతుకుపోతాడు.” అని ‘అతడు’ సినిమాలో బ్రహ్మీ కామెడీగా అంటాడు. కానీ మన చంద్రన్న దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టున్నాడు. కేవలం ఎన్నికలప్పుడు తప్ప జూనియర్ ఎన్టీఆర్ ఇంకెప్పుడూ గుర్తురావట్లేదు. క్రితం జరిగిన ఎన్నికల టైం లోను జూనియర్ ని వాడుకున్నాడు.
 
అప్పుడు పెద్దగా కలిసి రాలేదనుకోండి అది వేరే విషయం.ఇప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ తో తెలంగాణ ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా భారి భారీగా సభలు ఏర్పాటు చేయించి ఓట్లు నొక్కేద్దమనే ప్లాన్ లో ఉన్నాడట మరి..! 
 
పెద్దాయన పెట్టిన పార్టీ ఇప్పుడు తెలుగునాట ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అటు ఆంద్రా లోను బలహీనం అయ్యి...ఇటు తెలంగాణా లో ఏకంగా తుడుచుపెట్టుకుపోవడానికి సన్నద్ధం అయింది. ఇలాంటి తరుణంలో పెద్దాయన మనువడే తమని రక్షించగలడు అని గుర్తించిన కొంతమంది పార్టీ పెద్దలు ఆ ముక్కలు చంద్రన్న చెవిలో వదిలారు. ప్లాన్ బానే ఉందనుకున్న బాబు ఆ క్రమంలో పనులు ప్రారంభించినట్టు సమాచారం.అసలు చిక్కంతా ఎక్కడొచ్చిందంటే..కాంగ్రెస్ కు వ్యతిరేఖంగా ఆనాడు పెద్దాయన తెలుగుదేశం అనే ప్రాంతీయ పార్టీని పెట్టి తెలుగు జాతి గౌరవాన్ని దేశంలో దశదిశలా చాటిచెప్పారు.
 
ఇప్పుడు అదే కాంగ్రెస్ తో తెలంగాణలో పొత్తుకు ఉవ్విళ్లూరుతుంది నాయుడి గారి సైన్యం. తాతని తూచా తప్పకుండా అనుసరించే మనువడు దీనికి ఒకే అని ప్రచారానికి సిద్ధం అవుతాడా? పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేఖం అని వెనుదిరుగుతాడా? అనేది వేచి చూడాల్సిన విషయం. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.