కళ్యాణ్ రామ్ నిజమైన “MLA” అవుతాడా..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

kalyan ram
Updated:  2018-09-21 03:25:15

కళ్యాణ్ రామ్ నిజమైన “MLA” అవుతాడా..?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీ ని విలీనం చెయ్యడంతో ముందస్తు ఎన్నికలు వచ్చిపడ్డాయి. అయితే విలీనం చేస్తున్నారని వార్తలు ముందే బయటకి పొక్కడంతో రాజకీయ‌ పార్టీలన్నీ అప్రమత్తం అయ్యాయి. 
 
ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల కళ్ళు గ్రేటర్ హైదరాబాద్ లోని 28 నియోజక వర్గాల మీద పడింది. అక్కడ ఉండేది అందరు సెటిలర్లే కావడంతో తెదేపా వారిమీద దృష్టి సారించాలని తలచింది. వాళ్ళు ఎవరికీ ఓటువేస్తే వాళ్లదే హైదరాబాద్ అవుతుంది. ఈ విషయాన్నీ దృష్టి లో పెట్టుకున్న తెదేపా ఇప్పుడు కొత్త ప్లాన్లు వెయ్యడానికి పూనుకుంది. ఇదివరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ దాదాపు 12 సీట్లు కొల్లగొట్టినప్పటికీ ఆ తర్వాత ఆ నాయకులంతా తెరాస లోకి జంప్ అవ్వడంతో తెదేపా కి దిక్కులేకుండా అయ్యింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని దృఢ నిశ్చయంతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను రంగం లోకి దించాలని చంద్రబాబు అనుకున్నార‌ని సమాచారం.
 
గత ఎన్నికల్లో ఎన్టీఆర్ తో పాటుగా హరికృష్ణ, కళ్యాణ్ రామ్ లు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు . అయితే ఇటీవలే హరికృష్ణ మరణించడంతో మళ్ళీ నందమూరి కుటుంబం ఒక్కటయ్యింది. అలాగే నారా చంద్రబాబు నాయుడితో కూడా కలిసిపోయింది. ఇదే అదునుగా భావించిన చంద్రబాబు ఈ ఎన్నికల్లో కళ్యాణ్ రామ్ ని గ్రేటర్ లోని ఏదో ఒక నియోజక వర్గం నుండి పోటీ చేయించాలని భావిస్తున్నారట ! మరి నందమూరి సోదరులు కళ్యాణ్ రామ్ అందుకు ఒప్పుకుంటాడా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.