కాపులంటే టీడీపీకి ఎందుకంత కక్ష..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu
Updated:  2018-09-29 11:10:33

కాపులంటే టీడీపీకి ఎందుకంత కక్ష..?

రాష్ట్రంలో 15 శాతం ఉన్న కాపులంటే టీడీపీకి ఎందుకంత నిర్లక్ష్యం..?
హామీల పేరుతో టీడీపీ కాపులను దారుణంగా మోసం చేయడం దేనికి సంకేతం..?
ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాలలోకి వచ్చిన చిరంజీవిపై చంద్రబాబు ఎలాంటి ముద్ర వేయించారు..?
ఇప్పటివరకు టీడీపీ కాపులను ఎలా మోసం చేసిందో రాజకీయ విశ్లేషకులు చెప్పిన దాని ప్రకారం... కాపులపై జనహితం స్పెషల్ స్టోరీ.... 
 
1. కాపుల ఆరాధ్య దైవం వంగవీటి రంగాని హత్య జరిగింది టీడీపీ హయాంలో, హత్య చేసింది టీడీపీ నాయకులే అని వంగవీటి రంగ కుమారుడు వంగవీటి రాధా స్వయంగా చెప్పారు...కాపులంటే టీడీపీకి ఎంత కక్ష్య అనేది ఈ హత్యను బట్టే తెలుసుకోవచ్చు...
 
2. తన ప్రత్యర్థి నాయకుడిపై బురద జల్లడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య...ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిపై బాబు తన పచ్చ మీడియా చేత సీట్లు అమ్ముకున్నాడు అనే ముద్ర వేయించి చిరంజీవి ఇమేజ్ ని దెబ్బతీశాడు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు...
 
3. రాష్ట్రంలో 15 శాతం ఉన్న కాపు ఓట్ల కోసం 2014 ఎన్నికలలో టీడీపీ కాపులకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాపులను దారుణంగా మోసం చేసింది...
 
4. కాపులకు టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగిన కాపులను అక్రమంగా కెసులను, అక్రమ అరెస్టులను చూపించడం దేనికి సంకేతం... 
 
5. టీడీపీ ఇచ్చిన కాపు రిజర్వేషన్ హామీని నెరవేర్చాలని టీడీపీ ప్రభుత్వంపై పోరాడిన కాపు నేత ముద్రగడని, వాళ్ళ కుటుంబ సభ్యులను పోలీసులచేత కొట్టించిన ఘనత టీడీపీదే...
 
6. చిన బాబు లోకేష్ నన్ను, మా కుటుంబ సభ్యుల్ని కొట్టించారని ముద్రగడ స్వయంగా చెప్పారు.. కాపులంటే టీడీపీకి ఎంత చిన్నచూపో దీనిని బట్టి తెలుసుకోవచ్చు..
 
7. రిజర్వేషన్ 50 శాతం మించకూడదు అని తెలిసినా? తప్పుడు బిల్లును కేంద్రానికి పంపించి మరో సారి కాపులను మోసం చేసింది టీడీపీ..
 
8. కాపు ఓట్ల కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని దగ్గర చేసుకొని అవసరం తీరిన తర్వాత పవన్ కళ్యాణ్ ని దూరం పెట్టింది టీడీపీనే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు...
 
9. కాపు కార్పొరేషన్ కి 5000 కోట్లు ఇస్తామని చెప్పి, సుమారు ఐదేళ్లు గడిచిన కేవలం 1300 కోట్లు విడుదల చేసారు అంటే కాపులంటే టీడీపీకి ఎంత నిర్లక్ష్యమే ఇట్టే అర్థం అవుతుంది...
 
10. వంగవీటి రంగాను విమర్శించినందుకు గౌతమ్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసి కాపులకు వైసీపీ ఎంత విలువ ఇస్తుందో చెప్పింది...
 
కాపు సోదరులారా ఆలోచించండి...మీరు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి...ఒక్క నిముషం ఆలోచించండి... ఎవరు కాపులను మోసం చేసారు, చేస్తున్నారు...ఎవరు కాపుల వైపు నిలబడి, కాపులకు ఎవరు విలువ ఇస్తున్నారో ఆలోచించండి...అలోచించి కాపుల వైపు నిలబడే పార్టీకి ఓటు వేయండి....
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.