ఉండవల్లికి చంద్రబాబు చెక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-15 11:00:34

ఉండవల్లికి చంద్రబాబు చెక్

పోలవరం నుంచి ప్రభుత్వం చేస్తున్న అవినీతి వరకు ప్రతి అంశాన్ని లేవనెత్తి, ప్రజలకు అర్థమయ్యేలా వివరించి, ప్రజలతో చంద్రబాబు ఆడుతున్న నాటకానికి అడ్డంపడుతూ చంద్రబాబుకి చుక్కలు చూపిస్తున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఉండవల్లి మాట్లాడే తీరు, చెప్పే విషయాలు బాగా ఆకట్టుకుంటాయి ప్రజలకు. దీంతో జగన్ తర్వాత చంద్రబాబుకు ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది ఉండవల్లి..
 
అందుకే ఉండవల్లి టీడీపీకి చేస్తున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు ఎలాగైనా ఉండవల్లికి అడ్డుకట్ట వేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ ని రచించారు. చంద్రబాబు, టీడీపీ ఉండవల్లిని అడ్డుకోవడం అసాధ్యం అని భావించి... నాలుగేళ్లపాటు టీడీపీ సంసార బాధ్యతలు మోస్తున్న పవన్ కి అప్పగించి అమలుపరిచారు...
 
ప్రత్యేక హోదాపై అప్పుడప్పుడు ట్వీట్లతో, ఎప్పుడో ఒక సభతో, టీడీపీ మైలేజ్ తగ్గినప్పుడు, టీడీపీ ఇరుకున పడినప్పుడు కాపాడటానికి ప్రజల ముందుకు వస్తాడు పవన్...చంద్రబాబు ఇచ్చే హామీలకు నేను పూచి అని చెప్పి, టీడీపీ - బీజేపీ కూటమితో, జనసేన మద్దతుతో అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచిన, టీడీపీ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చకపోయిన, టీడీపీ చేస్తున్న అవినీతితో పాటు ఎన్నో అంశాలపై ప్రశ్నించని పవన్, మన ప్రభుత్వ తీరును ఎండగట్టకుండా కేంద్రం తీరును ఎండగట్టడానికి సిద్ధమయ్యారు... 
 
టీడీపీ కేంద్ర ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న, కేంద్ర కేబినెట్లో ఇద్దరు టీడీపీ మంత్రులు ఉన్నప్పటికీ ఏపీకి ప్రతి బడ్జెట్లో అన్యాయం జరుగుతున్నా టీడీపీ తీరును పవన్  ఎండగట్టలేదు, తను ప్రశించలేదు. కానీ కేంద్రం ఏపీని మొదటిసారి మోసం చేసినట్టు, కేంద్రం తీరుపై నేను పోరాడతా అని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నాడు...కేంద్రంపై పోరాడటానికి అని చెప్పి JAC అని కమిటి వేసి అందులో ఉండవల్లి పేరును చేర్చి, ఉండవల్లిని చంద్రబాబుకి దగ్గర చేయడానికి అద్భుతమైన నాటకానికి తెరతీశారు జనసేన అధినేత...
 
ఉండవల్లి జనసేన JAC లో ఉంటే టీడీపీ పైన చేసే విమర్శనాస్త్రాలు తగ్గుతాయని, ఎలాగైనా ఉండవల్లికి దగ్గరై జనసేనలోకి, లేదా టీడీపీలోకి ఆహ్వానించవచ్చని భావిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.