మాస్టర్ ప్లాన్ షురూ......

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-16 04:02:17

మాస్టర్ ప్లాన్ షురూ......

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయ క్రీడ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. ఓ వైపు ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రాన్ని ఢీ కొట్టేందుకు నువ్వా-నేనా అన్న‌ట్లుగా టీడీపీ-వైసీపీ పోటీ ప‌డుతున్నాయి. ఇందులో భాగంగానే రాజీనామాల ప‌ర్వానికి తెర‌లేపాయి రెండు పార్టీలు. మ‌రోవైపు కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ లో రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయంపై ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ జేఎఫ్ ఎఫ్సీ పేరుతో  హ‌డావుడి చేస్తున్నారు. 
 
త‌మ ఎంపీల చేత రాజీనామాలు చేయిస్తామ‌ని ప్ర‌క‌టించిన వైయ‌స్ జ‌గ‌న్ 2019 ఎన్నిక‌లే టార్గెట్ గా ముందుకు సాగుతున్నారు. ఇందుకు పోటీగా టీడీపీ ఎంపీలు కూడా మిత్ర ప‌క్ష‌మైన బీజేపీపై త‌మ‌దైన శైలిలో విరుచుకుప‌డుతున్నారు. దీనికి తోడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను అస్త్రంగా వాడుకుంటోంది టీడీపీ.
 
ప‌వ‌న్ జేఎఫ్ ఎఫ్ సీ వెనుక మాస్ట‌ర్ ప్లాన్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీ కూట‌మి క‌లిసినా కూడా వైకాపా స్వ‌ల్ప ఓట్ల శాతంతో  అధికారాన్ని కోల్పోవాల్సి వ‌చ్చింది. ఇప్పుడు రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో బీజేపీ క‌లిసే అవ‌కాశం లేద‌ని చెప్ప‌వ‌చ్చు.
 
ఈ క్ర‌మంలో ప‌వ‌న్ టీడీపీని కాపాడేందుకు జేఎఫ్ ఎఫ్సీ ప్లాన్ అమ‌లు చేస్తున్నార‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.  జేఎఫ్ ఎఫ్సీ లో సీనియ‌ర్ నాయ‌కులు, మేధావులు స‌రే.....రాష్ట్రాన్ని విభ‌జించి తెలుగు ప్ర‌జ‌ల గొంతు కోసిన కాంగ్రెస్ పార్టీని క‌లుపుకోవ‌డం ఏంట‌నేది ఇప్పుడు అంద‌రి ముందున్న ప్ర‌శ్న‌..
 
కేవ‌లం ప్రభుత్వ వ్య‌తిరేక  ఓట్లు వైకాపాకు ప‌డ‌కుండా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి మ‌ళ్లించేందుకు  ప‌వ‌న్- చంద్ర‌బాబు ఇలా వ్యూహాలు ర‌చిస్తున్నార‌ని అనుమానించ‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌నే ఉద్దేశ్యంతో హోదాను అస్త్రంగా వాడుకుని రాజీనామా ప్ర‌క‌ట‌నల‌కు తెర‌లేపింది వైసీపీ. 
 
మ‌రి తెలుగుదేశం పార్టీని కాపాడేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వేస్తున్న మాస్ట‌ర్ ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా......హోదా కోసం  వైకాపా ఎంపీల‌తో రాజీనామా చేయించి  కేంద్రం మొహాన విసిరి పారేస్తానంటున్న జ‌గ‌న్ రాజ‌కీయ వ్యూహాం ఫ‌లిస్తుందా.....ఎవ‌రు ఎన్ని ప‌థ‌కాలు వేసిన అంతిమంగా ప్రజా తీర్పు మాత్రం ముఖ్యం.

షేర్ :

Comments

1 Comment

  1. Jai JAGAN

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.