మీడియాపై మ‌న‌సులో మాట

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-02 16:01:41

మీడియాపై మ‌న‌సులో మాట

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎటువంటి ప్ర‌సంగాలు ఇచ్చినా అందులో థీమ్ ను అంత సుల‌భంగా అర్దం చేసుకోలేము.. మ‌న‌సులో భావాల‌ను ఈజీగా బ‌య‌టకు వెల్ల‌డిస్తారు బాబు. మ‌నం చేస్తే క‌రెక్ట్ అవ‌త‌ల‌వాడు అదే ప‌నిచేస్తే రాంగ్ అనే రూటు నుంచి ఇంకా తెలుగుదేశం బయ‌ట‌కు రావ‌డం లేదు.దీనికి కార‌ణం కూడా వారు చెప్పే మాట‌లు చేసే వ్యాఖ్య‌లు అని చెప్పాలి.
 
ఇక ఇక్క‌డ ఫిరాయింపుల‌కు ప‌చ్చ తివాచి ప‌రిచిని తెలుగుదేశం నేత‌లు, అదే గుజ‌రాత్ క‌ర్నాట‌క‌లో ఎక్క‌డ త‌మ మిత్ర పార్టీ బీజేపీ చేస్తుందో అని అల‌క‌లు చెందారు... చివ‌ర‌కు క‌ర్నాట‌క‌లో బీజేపీ ఇటువంటి దారుణాలకి పాల్ప‌డుతోందా అని మండిప‌డ్డారు బాబు.. ఇది ఎంత దుర్మార్గం ఇటువంటి ప‌రిణామం ఎక్క‌డా చూడ‌లేదు అన్నారు.. ఇక మాజీ మిత్ర పార్టీ ఇటువంటి ప‌ని నిజంగా చేసి ఉంటే అక్క‌డ కుమార‌స్వామికి పీఠం ఇవ్వ‌క‌పోతే రాజ‌కీయంగా ఏపీలో ఎటువంటి మ‌లుపులు తిరిగేవో తెలిసిందే.
 
ఇక్కడ బీజేపీ త‌న మాస్ట‌ర్ ప్లాన్ అవ‌లంభించేది, అయితే రిజ‌ల్ట్ రోజున ఏ ఒక్క తెలుగుదేశం నేత కాన‌రాలేదు, త‌ర్వాత కుమార‌స్వామి బ‌ల‌నిరూప‌ణ స‌మ‌యంలో బ‌య‌ట‌కు  వ‌చ్చి ప్ర‌సంగాలు కౌంట‌ర్లు చేశారు.. ఏకంగా దేశంలో కాంగ్రేస్ బీజేపీయేత‌ర శ‌క్తులు అన్నీ క‌లిసేలా బాబు కుమార‌స్వామికి స‌ల‌హా ఇచ్చారు అనేలా ఎల్లో మీడియా వార్త‌లు వ‌డ్డించింది.
 
అయితే నిర్మాణ‌దీక్ష అంటూ అధికార తెలుగుదేశం పార్టీ వంచ‌న దీక్ష అంటూ ప్ర‌తిప‌క్ష పార్టీ పోటా పోటిగా దీక్ష‌లు చేస్తుంటే, బీజేపీ- కాంగ్రెస్ లు స్ద‌బ్దుగా ఉన్నాయి. ఇక బాబు, మీడియా ముఖంగా ప‌లు విష‌యాల‌పై మాట్లాడుతూ మీడియాను 40 ఏళ్లుగా డీల్ చేస్తున్నాను అని వ్యాఖ్యానించారు దీంతో అందరూ షాక్ అయ్యార‌ట‌.
 
అందుకే ఆయ‌న మ‌న‌సులో ఎటువంటి వ్యాఖ్య‌లు అయినా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌తాయి అన‌డానికి ఇదే ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు అంటున్నారు. ఇక ఇక్క‌డ ఫిరాయింపుల పై మాట్లాడ‌టం లేదు కాని గ‌వ‌ర్న‌ర్ తో ప‌ది మంది బీజేపీయేత‌ర ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్ర‌యత్నించిందని రాజ్యంగం ఎమైపోతోంద‌ని ఆయ‌న స్టైల్లో మాట్లాడ‌టం కొస‌మెరుపు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.