బ‌ల‌మైన కోరిక బ‌య‌ట‌ప‌డింది

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-12 12:56:15

బ‌ల‌మైన కోరిక బ‌య‌ట‌ప‌డింది

రాష్ట్రం బాగోవాలి అన్నా దేశంలో అమ‌రావ‌తి అద్బుతమైన రాజ‌ధానిగా నిర్మించాలి అన్నా తాను మ‌రోసారి ముఖ్య‌మంత్రి అవ్వాలి, సీఎంగా తెలుగుదేశం నేత అవ్వాలి, తెలుగుదేశం మ‌రోసారి అధికారంలోకి రావాలి అన్నారు సీఎం చంద్ర‌బాబు. అయితే అధికార పార్టీ కాబ‌ట్టి ఆ కోరిక ఉంటుంది. అయితే దీనిపై వైసీపీ బీజేపీ విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. తెలుగుదేశం గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను తుంగ‌లోకి తొక్కి కొత్త‌గా ఎటువంటి హామీలు ఇవ్వాలో తెలియ‌క ఆలోచిస్తుంటే, ఇప్పుడు ప్ర‌జ‌లు మ‌రోసారి తెలుగుదేశం అధికారంలోకి రావాలి అని ఎలా కోరుకుంటారు అని ప్ర‌శ్నిస్తున్నారు.
 
ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా గెల‌వాలి అని తెలుగుదేశం నాయ‌కుల‌కు తెలియ‌చేవారు సీఎం చంద్రబాబు. నాలుగు బ‌డ్జెట్ ల వ‌ర‌కూ వెయిట్ చేసిన చంద్ర‌బాబు, ఐద‌వ బ‌డ్జెట్ లో అన్యాయం జ‌రిగింది కాబ‌ట్టి బ‌య‌ట‌కు వ‌చ్చాము అని తెలియ‌చేశారు. ఏపీ ఇంత అభివృద్ది చెందింది అంటే అంతా మ‌న వ‌ల్లే, కేంద్రం ఎటువంటి సాయం చేయ‌లేదు అనేలా ఆయ‌న తెలియ‌చేశారు. బీజేపీ నాయ‌కులు మ‌న‌కు చుక్కులు చూపిస్తామంటున్నారు అస‌లు తెలుగుదేశం పార్టీని బీజేపీ ఏమి చేయ‌లేదు అని అన్నారు ఆయ‌న‌.. ఓ పక్క జనాభా నియంత్రణ చేస్తుంటే, ఇపుడు 15వ ఆర్థిక సంఘం ద్వారా లింక్‌పెట్టి నిధులు తగ్గించాలని చూస్తున్నారని మండిపడ్డారు. దీని వలన అసెంబ్లీ, పార్లమెంట్‌ సీట్లు కూడా తగ్గిపోతాయన్నారు.
 
ఇక ప్ర‌తిప‌క్షం మన‌పై  విమ‌ర్శ‌లు చేస్తే వ‌దిలిపెట్ట‌వ‌ద్దు అని ఆయ‌న అన్నారు.ప్రతిపక్షాల ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు. పబ్లిసిటీ రావడం లేదని అమెరికా నుంచి ఓ మహిళ చెప్పిందని, ఆ దిశగా అందరూ పనిచేయాలని తెలిపారు..50 కోట్లు పెట్టి రోడ్లు వేయిస్తే దానివల్లే ఓట్లు పడవని, పాలిటిక్స్‌ చేయలన్నారు. ఏం చేస్తే మెజారిటీ వస్తుందో అందరూ ఆలోచించాలి చంద్రబాబు వ్యాఖ్యానించారు.ఇక ఏ మీటింగ్ జ‌రిగినా ప్ర‌తిప‌క్షం పేరు ఎత్త‌కుండా బాబుగారి స్పీచ్ ముగియ‌దు అని అంటున్నారు కొంద‌రు విశ్లేష‌కులు. మొత్తానికి అసెంబ్లీ సీట్లు త‌గ్గిపోతాయి ఎంపీ సీట్లు కోల్పోతాం అని బీరాలు ప‌ల‌క‌డం ఎందుకు, ఆ సీట్ల క‌న్నా ఏపీ ప్ర‌యోజ‌నాలు ముఖ్యం అంటున్నారు ప్ర‌జ‌లు. ఆ సీట్లు గురించి చ‌ర్చ‌లు ఎందుకు అని అంటున్నారు.
 
ఇటు బీజేపీ కూడా కేంద్రం నిధులు ఇవ్వ‌కుండా ఏపీలో ప‌లు ప‌థ‌కాలు అమ‌లు చేశారా అని ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తానికి బాబు బ‌ల‌మైన కోరిక బ‌య‌ట‌ప‌డింది వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం ఎలాగైనా విజ‌యం సాధించాల‌ని ఆయ‌న బ‌లంగా కోరుకుంటున్నారు అనేది నేడు స్ప‌ష్టం అయింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.