మోదీ విష‌యంలో బాబు ఏమ‌న్నారంటే ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-04 15:02:14

మోదీ విష‌యంలో బాబు ఏమ‌న్నారంటే ?

ఏపీ సీఎం చంద్ర‌బాబు బిజీ బిజీగా గ‌డుపుతున్నారు హ‌స్తిన‌లో జాతీయ‌స్దాయిలో ఓ పెద్ద చ‌ర్చ‌ను తీసుకువ‌చ్చి ఏపీకి ప్ర‌త్యేక హూదా తీసుకురావ‌డానికి 48 గంట‌ల‌పాటు హ‌స్తిన టూర్ వేశారు సీఎం చంద్ర‌బాబు మొద‌టి రోజు కొంద‌రు ఎంపీల‌ను క‌లుసుకోవ‌డం అక్క‌డ పెద్ద ఉప‌యోగం ఏమీ లభించ‌లేదు అని నేరుగా త‌మ్ముళ్లే తెలియ‌చేశారు వారి అభిప్రాయంగా చ‌ర్చించుకున్నారు.
 
అయితే మీడియాతో బాబు చిట్ చాట్ చేశారు ఈ స‌మ‌యంలో ప‌లు ఆస‌క్తిక‌ర స‌మాధానాలు ఇచ్చారు మోదీకి బాబుకు మ‌ధ్య ఎలాంటి విభేదాలు ఉన్నాయో మౌనంగానే తెలియ‌చేశారు ఆయ‌న క్లుప్త స‌మాధానాల‌తో..
 
!! మీడియా !!
జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత, ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ గురించి మాట్లాడేందుకు చంద్రబాబు నిరాకరించారు. గుజరాత్‌ అల్లర్ల తర్వాత మోదీని సీఎం పదవి నుంచి తప్పించాలని మొదట డిమాండ్‌ చేసింది మీరే కదా!
 
!! బాబు !!!
అవును. ఆ విషయాన్ని చరిత్ర రికార్డుల నుంచి ఎవరూ చెరిపివేయలేరు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీతో చేతులు కలిపాను. మోదీ ఇలా చేస్తారనుకోలేదు
 
!! మీడియా !!
అప్పట్లో మీరు అనుసరించిన వైఖరిని మోదీ గుర్తుపెట్టుకున్నారేమో
 
!బాబు !!
ఉండొచ్చు నాకు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం.
 
!! మీడియా !!
ఏపీకి సాయం చేస్తే అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలను అధిగమిస్తుందని, ఆ ఘనత మీకు దక్కుతుందనే మోదీ సహాయం చేయలేదా?
 
!! బాబు !!
ఆ విషయం మీరే గ్రహించాలి!
 
!! మీడియా!! 
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం పట్ల సానుకూలంగా వ్యవహరించడం లేదు కదా..
 
!! బాబు !!
ఔను అన్నట్లుగా తల ఊపారు
 
జాతీయ స్థాయిలో మీరు పోషించే పాత్ర ఏమిటి?
 
ఏపీకి జరిగిన అన్యాయాన్ని బీజేపీ, కాంగ్రెసేతర ప్రతిపక్షాలకు వివరించేందుకే ఢిల్లీకి వచ్చాను. కాంగ్రెస్‌ నేతల్ని కూడా కలుసుకోవడం లేదు. ప్రస్తుతం రాజకీయాలు ముఖ్యం కాదు. ఏపీకి న్యాయం చేయాల్సిందిగా కేంద్రంపై మీ ద్వారా ఒత్తిడి చేయడమే ముఖ్యం అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.