మిత్ర‌ప‌క్షం పై బాబు మెత‌క వైఖ‌రి రీజ‌న్‌ ఏంటి..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-15 15:54:01

మిత్ర‌ప‌క్షం పై బాబు మెత‌క వైఖ‌రి రీజ‌న్‌ ఏంటి..?

తాజాగా యూపీ, బీహార్‌ ఉప ఎన్నికల్లో  మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ ఓటమి చెంద‌డం పై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స్పందించారు. ప్ర‌జ‌ల జీవన విధానాల‌ను అంచ‌నా వేయ‌కుండా వారికి ఏమి అవ‌స‌ర‌మో అవి నెర‌వేర్చ‌కుండా  ప‌రిపాల‌న చేస్తే ప్ర‌జ‌లు ఇలాంటి ఫ‌లితాలే ఇస్తార‌ని చంద్రబాబు అన్నారు.. తాజా రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా ప్ర‌స్తుతం వ‌చ్చిన ఎన్నిక‌ల ఫ‌లితాలు అన్ని రాజ‌కీయ పార్టీల‌ను ఆలోచ‌న‌లో ప‌డేశాయ‌ని తెలిపారు. ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లు అంతు చిక్క‌లేనంత విధంగా మారుతున్నాయ‌ని అన్నారు.
 
గ్రీవెన్స్‌ హాలులో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ప్ర‌స్తుతం ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదికి త‌న‌కు ఎలాంటి విభేదాలు లేవ‌ని అన్నారు. గ‌తంలో  జ‌రిగిన మ‌న‌స్ప‌ర్ధ‌లు, విభేదాలు ఇప్పుడు అవ‌స‌రం లేద‌ని తెలియ‌చేశారు... అయితే ఏ ల‌క్ష్యాల‌ను పెట్టుకుని బీజేపీతో పోత్తుపెట్టుకున్నానో అవి నేర‌వేర‌లేద‌ని అన్నారు బాబు .నేటితో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి నాలుగు దశాబ్దాలైందని, 40 ఏళ్ళ క్రితం ఇదేరోజు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశానని చంద్రబాబు తెలిపారు.  
 
ప్ర‌త్యేక‌హోదా  కావాల‌న్న మాట‌లు వ‌దిలి ప్ర‌తిప‌క్ష‌పార్టీ వైసీపీ పై ఎదురుదాడి చేయాల‌ని పార్టీ నాయ‌కుల‌కు సూచించారు చంద్ర‌బాబు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ వైసీపీతో పోత్తు పెట్టుకుంటున్న విష‌యాన్ని గ‌ట్టిగా ప్రచారం చేయాలని సూచించారు. అలాగే ప్ర‌త్యేక‌హోదా కోసం టీడీపీ చేస్తున్న పోరాటాన్ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌ని నాయ‌కుల‌కు ఆయ‌న తెలిపారు ...దళితతేజం తరహాలో మే నెల నుంచి అక్టోబర్‌ వరకు బీసీ, ఎస్టీ, మైనారిటీ చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం సూచించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.