జ‌గ‌న్ పై బాబు ప్ర‌శంసలు.....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-01 12:04:00

జ‌గ‌న్ పై బాబు ప్ర‌శంసలు.....

వైయ‌స్సార్ బ‌తికి ఉన్నంత వ‌ర‌కూ జ‌గ‌న్ మంచి వాడు.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వ‌ర‌కూ జ‌గ‌న్ చాలా మంచి వాడు.. కాని ఎప్పుడైతే జ‌గ‌న్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఓదార్పుయాత్ర‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లాడో అప్పుడు చెడ్డ‌వాడు అయ్యాడు. ఇక జ‌గ‌న్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక కాంగ్రెస్ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో తెలిసిందే.. ఇక కాంగ్రెస్ పార్టీ ఓదార్పుయాత్ర చేయ‌కూడ‌దు అని, అంద‌రిని ఓ చోట‌కు పిలిచి ప‌రామ‌ర్శంచ‌మ‌ని చెప్పారు ఆ నాడు సోనియా.. అయితే జ‌గ‌న్ అంత‌టి శ‌క్తివంత‌మైన మ‌హిళ‌ను ఎదురించి నిలుచున్నాడు జ‌గ‌న్ ... చివ‌ర‌కు జ‌గ‌న్ పై అక్ర‌మంగా కేసులు మోపారు.
 
ఇక తాజాగా వైయ‌స్ ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప్ర‌జ‌ల్లో ఉన్నారు జ‌గ‌న్..  ఇక ఎన్నిక‌ల‌కు ముందు మాత్ర‌మే జ‌గ‌న్ జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు..  జ‌గ‌న్ పొలిటిక‌ల్ గా ఎలాగైనా పైకి ఎద‌గ‌కూడ‌దు అని నాడు కాంగ్రెస్ వేసిన ఎత్తుగ‌డ. అయితే జ‌గ‌న్ పైకేసుల్లో తెలుగుదేశం త‌ర‌పున ఎర్ర‌న్నాయుడు,  కాంగ్రెస్ త‌ర‌పున శంక‌ర్రావు ముందు అడుగువేశారు. అయితే ఇటు కేంద్రం కూడా దీనికి బ‌లం చేకూర్చి జ‌గ‌న్ ను ఇరికించింది.
 
చంద్ర‌బాబు పార్టీ నుంచి అంద‌రూ అనేది ల‌చ్చ‌ల కోట్ల అవినీతి అంటూ జ‌గ‌న్ పై అనేక విమ‌ర్శ‌లు చేస్తారు. అయితే ఇక్క‌డ ఆలోచించ ద‌గ్గ విష‌యం ఏమిటంటే ఇక్క‌డ కాంగ్రెస్ జ‌గ‌న్ పై కుట్ర‌ప‌న్నింది, దానికి చంద్ర‌బాబు కూడా వ‌త్తాసు ప‌లికారు అనేది మ‌రో వాద‌న‌.. తాజాగా చంద్ర‌బాబు దీనిపై మాట్లాడారు కేంద్రం పై జ‌గ‌న్ పోరాటం చేశాడు, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాని ఎదురించి మాట్లాడారు... వాళ్లకు క‌డుపు మండి జ‌గ‌న్ ను కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టారు.. అన్నాడు అయితే ఇక్క‌డ పొలిటిక‌ల్ గా నిజం.. బాబు ఇన్నాళ్ల‌కు జ‌గ‌న్ విష‌యంలో ఓ స‌త్య‌వంత‌మైన స‌త్యాన్ని తెలియ‌చేశారు.. ఈ విష‌యం విని హ‌రిశ్చంద్రుడు కూడా ఆనందిస్తాడు.
 
అది నిజం, వాస్తవం, ఆర్దిక ఉగ్ర‌వాది కాదు, ఆర్దిక నేర‌గాడు కాదు, అయితే తెలుగుదేశం  నాయ‌కులు చేసే కామెంట్లు అర్ధం ప‌ర్ధం లేని వ్యాఖ్య‌లు అనేవి తేలిపోయింది... తెలుగుదేశం -హ‌స్తం జ‌గ‌న్ జైలుకు వెళ్ల‌డంలో ఎంత పాత్ర ఉందో ఓ ప‌క్క జ‌గ‌న్ ప‌దే ప‌దే ప్ర‌సంగాల్లో చెబుతారు... కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు క‌లిసి త‌నపై కుమ్మ‌క్కై కేసులు వేశారు అంటారు.. ఇది వాస్త‌వం మ‌రి జ‌గ‌న్ ని మెచ్చుకోవాల్సిందే, జ‌గ‌న్ కేసులు అన్ని అక్ర‌మం అని తేలిన‌ట్టే, ఇక చార్జీషీట్లు ఒక్కొక్క‌టి కొట్టుకుపోతుంటే జ‌గ‌న్ కేసుల్లో క్లీన్ చీట్ సాధించుకోవ‌డం తొంద‌ర‌లోనే ఉంటుంది అనేది వైసీపీ వాద‌న‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.