సీనియారిటీకి ఓట్లు ఇక రాల‌వు బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-27 16:53:11

సీనియారిటీకి ఓట్లు ఇక రాల‌వు బాబు

గ‌తంలో కాంగ్రెస్ పార్టీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో, మంచి పోటీ తెలుగుదేశానికి ఇచ్చింది అనేది అంద‌రికి తెలిసిందే.. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్ర‌బాబుకు మ‌రో ప‌దేళ్లు ప్ర‌తిప‌క్ష కుర్చీ ఇచ్చారు ఏపీ ప్ర‌జ‌లు..ఇక మూడోసారి సీఎం అయిన త‌ర్వాత  ఇప్పుడు అమ‌రావ‌తి నిర్మాణం సీనియ‌ర్ అని ఆయ‌న చేప‌డ‌తారు అని భావించారు.. కాని ఇక్క‌డ నాలుగు సంవ‌త్స‌రాల‌లోబొండు ఇసుక‌తో కూడా ఒక్క నిర్మాణం చేప‌ట్ట‌లేక‌పోయారు..ఇది ఇక్క‌డ తెలుగుదేశం ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో చేసినే అభివృద్ది. ఇక క‌ట్టిన స‌చివాలయం కూడా రెండు సెంటీమీట‌ర్ల వ‌ర్షం వ‌స్తే ఎంజెల్ జ‌ల‌పాతంలా లోప‌ల అంతా వ‌ర్ష‌పునీరు క‌నువిందు చేస్తోంది.. వంద‌ల‌కోట్ల రూపాయ‌లు ఇలా వ‌ర్షం నీరు కార‌డాన‌కి వెచ్చించారా అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది.
 
ఇక ఎంత గొప్ప‌ టెక్నాల‌జీ వాడి ఇక్క‌డ నిర్మాణాలు చేప‌ట్టామ‌ని చెబుతున్నారు..ఇటువంటి ప‌రిస్దితి క‌నిపించ‌డం కాంట్రాక్ట‌ర్ల అల‌స‌త్వం నిర్ల‌క్ష్యానికి ప‌రాకాష్ట‌గా చెప్ప‌వచ్చు.. ముఖ్యంగా ఇక్క‌డ‌నిర్మాణాలు చూస్తుంటే ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డలేదు. ఇక స్పెష‌ల్ స్టేట‌స్ వస్తే అభివృద్ది జ‌రుగ‌దు అని గ‌తంలో చెప్పిన  తెలుగుదేశం నాయ‌కులు, మ‌ళ్లీ ఇప్పుడు ఏపీకి స్పెష‌ల్ స్టేట‌స్ కావాలి అని ఎందుకు అడుగుతున్నారు అనేది వారే స‌మాధానం చెప్పాలి..ముఖ్యంగా తెలుగుదేశం నాయ‌కులు దీనికి స‌మాధానం ఇస్తే వారి ఆస్ధాన మీడియాలు గ‌తంలో వీరు ఏమి చెప్పారు ఇప్పుడు ఏమీ చెబుతున్నారు అనేది ప్ర‌చురించాలి, వ్యూయ‌ర్స్ కి చూపించారు.
 
ఇటు ఏపీకి కేంద్ర ప్రభుత్వం స‌హ‌క‌రించాల్సిందే, దానికి కావ‌ల‌సిన అభివృద్దికి ప‌నుల‌కు అనుమ‌తులు ఇవ్వాల్సిందే.. ఇటు ఏపీకి సంబంధించి జాతియ విప‌త్తులు, రవాణా, ఆహార భ‌ద్ర‌త‌, ఆర్ అండ్ బీ, వ్య‌వ‌సాయ శాఖ‌, విదేంశాగ శాఖ భ‌వ‌నాలు క‌ట్ట‌డానికి కేంద్రం సాయం చేస్తుంది దానికి సంబంధించి ల్యాండ్ అలాట్ మెంట్ ఏపీ స‌ర్కారు చెయ్యాలి.. కాని ఇటువంటి ప‌నిలో కూడా తెలుగుదేశం స‌ర్కారు కేంద్రానికి స‌రైన స‌మాచారం ఇవ్వ‌లేదు అని అందుకే ఆ ప‌నులు కూడా ముందుకు వెళ్ల‌లేదు అని అంటున్నారు కొంద‌రు పెద్ద‌లు.
 
ఇటు నేష‌నల్ ఎడ్యుకేష‌న్ ఇనిస్టిట్యూట్స్ కు ప్ర‌యారిటీ ఇవ్వాల్సిన అధికార పార్టీ ఇక్క‌డ ప్రైవేట్ విద్యాసంస్ద‌ల‌కు ఎక‌రాలు కేటాయిస్తోంది అనే విమ‌ర్శ‌లు ఉన్నాయి..మ‌రి దీనిపై కూడా కేంద్రం వెన‌క‌డుగు వేసింద‌ట..మ‌రో ప‌క్క అధికార టీడీపీ చెప్పేదాని ప్ర‌కారం తాము స్ద‌లం ఇచ్చినా కేంద్రం నిర్మాణ‌ ప‌నులు త్వ‌రిత గ‌తిన చేయ‌డం లేదు అని కొత్త ప‌ల్ల‌వి అందుకుంటున్నారు. మ‌రి ప్ర‌జ‌ల‌కు ఇరు ప్ర‌భుత్వాలు చెవిలో పువ్వులు పెడితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇద్ద‌రిని ఇంటికి పంపించే ఆలోచ‌న చేయ‌డం త‌థ్యం అని విశ్లేష‌కులు ప్ర‌జ‌లు హెచ్చ‌రిస్తున్నారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.