బాబు సీనియారిటి ఎవరికోసం?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-03 03:29:15

బాబు సీనియారిటి ఎవరికోసం?

ఎవరైనా అనుభవం పెరిగే కొద్దీ చేసిన తప్పులను సరిద్దుకొని మళ్ళి ఎప్పుడు అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటారు...కానీ చంద్రబాబు మాత్రం అందుకు బిన్నంగా వ్యవహరిస్తున్నారు...రాజకీయాలలో 40 ఏళ్ల అనుభవం ఉంది, ఇంతకు ముందు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసారు...మళ్ళి ఇప్పుడు నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు...గత 36 ఏళ్లలో ఎప్పుడు ఎదుర్కొని విమర్శలను కేవలం ఈ నాలుగేళ్లలోనే ఎదుర్కొన్నారు...అయన ఇచ్చిన మాటలు, చేసిన పనులు తిరిగి ఆయన్నే వెక్కిరిస్తున్నాయి...
 
సుదీర్ఘ 40 రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు పరిపాలన నుండి అన్నిట్లోనూ ఫెయిల్ అయింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు...దేశంలోనే సీనియర్ అని చెప్పుకొనే చంద్రబాబు, ఆ సీనియారిటీ ఎందుకు పనికిరాకుండా పోయింది అంటున్నారు ప్రజలు...నలభై ఏళ్ల అనుభవం నలభై ఏళ్ల కుర్రాడి ముంది తేలిపోయింది అంటున్నారు సీనియర్లు...దానికి కొన్ని కారణాలు కూడా చెప్తున్నారు...
 
1.  మోడీ చంద్రబాబుకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వనప్పుడు, ప్రత్యేక హోదా ఎలా ఇస్తారు అనుకున్నారు? దేశంలోనే సీనియారిటీ ఆ మాత్రం ఆలోచించలేదా?
 
2 . ఐదేళ్ల కాలపరిమితిలో ఎవరైనా రెండేళ్లు లేదా మూడేళ్లు వెయిట్ చేస్తారు, నాలుగేళ్లు ఎవరైనా కలిసి కాపురం చేస్తారా? ఆ మాత్రం బాబు తెలియదా? 
 
3. దేశంలోనే సీనియర్ అయినా చంద్రబాబుకు ప్యాకేజిలో విభజన చట్టంలోని హామీలు తప్ప వేరేవి లేవని తెలీదా?
 
4. మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ప్రత్యేక హోదా వస్తే... వచ్చే లాభాలు తెలియదా? అయితే హోదా ఏమైనా సంజీవన, హోదాతో ఏమి రాదు అని ఎందుకు అన్నారు
 
5. నాలుగేళ్లు గడుస్తున్నా రాజధాని అమరావతి కోసం డిజైన్లను ఫైనల్ చేయలేదంటే... అయన పరిపాలన ఎంత గొప్పగా చేస్తున్నారో చెప్పనక్కర్లేదు...
 
6 . జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం కాంట్రాక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం చేతికి తెచ్చుకోవడంలో ఉన్న మతలబు ఏంటి? కేవలం కమిషన్ల కోసమేనా?
 
7. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్ళ తర్వాత యూ-టర్న్ తీసుకున్న అనుభవం గొప్పదా? అంత అనుభవం లేకపోయినా ప్రత్యేక హోదా వాళ్ళ వచ్చే లాభాలను ప్రజలకు వివరించి హోదాని సజీవంగా ఉంచిన 40 ఏళ్ల కుర్రోడు గొప్పోడా?
 
8. కేవలం 25 ఎంపీ సీట్లతో ప్రధాన మంత్రి డిసైడ్ చేస్తా అంటే? ప్రజలను మభ్యపెట్టడానికి ఆ అనుభవం ఎంతగా ఉపయోగపడుతుందో చుడండి...
 
9. 40 ఏళ్ల కుర్రోడు మనకు ఉన్న బడ్జెట్ తో రుణమాఫీ చేయడం అసాధ్యం అని చెప్తే, 40 ఏళ్ల అనుభవం నేను చేసి చూపిస్తా అని నమ్మించి, రైతులను నిలువునా ముంచినందుకా?
 
10. 40 ఏళ్ల అనుభవంతో అవినీతి ఎలా చేయాలో నేర్చుకొని, రాష్ట్రాన్ని అవినీతిలో ముందుకు తీసుకుపోతున్నందుకా? 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.