బీజేపీ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన చంద్ర‌బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-21 12:41:19

బీజేపీ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన చంద్ర‌బాబు

ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం త‌న పార్టీ స్వ‌లంబ‌న కోసం రాష్ట్ర అభివృద్దిని కేంద్ర ప్ర‌భుత్వానికి తాక‌ట్టుపెట్టిన  విష‌యం అంద‌రికి తెలిసిందే. రాష్ట్ర విభ‌జ‌నతో ఆర్థికంగా వెన‌కబ‌డిన‌టువంటి ఆంధ్రప్ర‌దేశ్‌కు సుప‌రిపాల‌న అందించి అభివృద్ది చేయాల్సింది  పోయి అవినీతికి నిల‌యంగా రాష్ట్రాన్ని మార్చిన ఘ‌న‌త సీఏం చంద్ర‌బాబు నాయుడికే ద‌క్కుతుంద‌ని  అంటున్నారు ప్ర‌జ‌లు.
 
రాష్ట్రానికి ప్ర‌పంచాన్ని త‌ల‌ద‌న్నే రాజ‌ధానిని నిర్మిస్తాన‌ని ఎన్నిక‌ల హ‌మిలో ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా క‌నీసం రాజ‌ధానికి సంబందించిన డిజైన్లను సైతం ఖ‌రారు చేయ‌లేదు. అలాగే రాష్ట్రానికి పెట్టుబ‌డులు రావ‌డానికి పారిశ్రామిక స‌ద‌స్సులు ఏర్పాటు చేసిన చంద్ర‌బాబు దానికి ఫ‌లితంగా కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని ప్ర‌చారం చేశారు. వీటి వ‌ల్ల వ‌చ్చిన అభివృద్ది మాత్రం శూన్యం. ఈ విధంగా గొప్ప‌లు చెప్పుకోవ‌డం త‌ప్పా  ఆచ‌ర‌ణ‌లో చూపించిన దాఖ‌లాలు ఇంత‌వ‌ర‌కు లేకపోవ‌డం గ‌మ‌నార్హం.
 
అదే విధంగా దేశంలో త‌న‌క‌న్నా అనుభ‌వ‌జ్ఙులు ఎవ‌రులేర‌ని ప‌దేప‌దే చెప్పే చంద్ర‌బాబు... తాజాగా  ఉండవల్లితో తన నివాసంలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి టీడీపీనే కారణమని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశంలో ఉన్న‌ 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి చెందిన చంద్ర‌బాబు జాతీయ స్థాయిలో  బీజేపీని అధికారంలోకి తీసుకువ‌చ్చే విధానానికి స్వ‌స్తిప‌లికి సొంత పార్టీ అయిన తెలుగుదేశాన్ని జాతీయ స్థాయిలో అధికారంలోకి తీసుకురాకూడ‌దా.... అంటూ నెటిజెన్లు అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.