చంద్ర‌బాబు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ap-cm-nara-chandrababu-naidu
Updated:  2018-02-25 10:18:41

చంద్ర‌బాబు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

ఏపీ ముఖ్య‌మంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు మ‌రోసారి రైతుల‌ను ఉద్దేశించి ప‌లు సంచ‌ల‌న  వ్యాఖ్య‌లు చేశారు... ఉండ‌వ‌ల్లిలోని ప్ర‌జా ద‌ర్బార్ హాల్ ల్లో ఈ- ప్ర‌గ‌తి ఐఎస్ బీ గ్రాడ్యుయేష‌న్ స‌ర్టిఫికెట్ ప్ర‌ధానోత్స‌వంలో ముఖ్య‌మంత్రి పాల్గొన్నారు... ఈ సంద‌ర్భంగా బాబు మాట్లాడుతూ... ప్ర‌తీ ఒక్క రైతు ఇన్ పుట్ స‌బ్సీడీల‌కు అల‌వాడుప‌డుతున్నార‌ని, తాను కూడా వ్య‌వ‌సాయ‌ రంగ సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టాన‌ని  పంట‌కు న‌ష్టం వాటిల్లితే ఏ మోతాదులో న‌ష్టం వాటిల్లుతుందో త‌న‌కు తెలుసని అన్నారు.. అలాగే   రైతుల‌ను కించ ప‌రుస్తూ మాట్లాడారు చంద్ర‌బాబు.
 
గ‌తంలో కూడా ముఖ్య‌మంత్రి రైతుల‌ను కించ‌ప‌రిచేలా అనేక వ్యాఖ్య‌లు చేశారు..అయితే మ‌రోసారి ఉండ‌వ‌ల్లి వేదిక‌గా చేసుకుని చంద్ర‌బాబు  వ్య‌వ‌సాయం అనేది ఇన్ పుట్ క్రాస్ స‌బ్సీడీల కోస‌మే చేస్తార‌నే  అర్థం వ‌చ్చేలా  చెప్పారు... ఈ క్ర‌మంలో ఉండ‌వ‌ల్లిలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు ప్ర‌తి ప‌క్ష, మిత్ర ప‌క్ష నేత‌లు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు.
 
ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్న ఆయ‌న ప్ర‌జ‌ల‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడ‌టం స‌రికాద‌ని అంటున్నారు...  స‌హజంగా రైతులు పండించిన పంట చేతికి వ‌చ్చాక, మార్కెట్ లో గిట్టు బాటు ధ‌ర వ‌చ్చిందంటే ఇన్ పుట్ స‌బ్సీడీల కోసం  ఆలోచించ‌రు... ఒక వేళ ఊహించ‌ని విధంగా పంట న‌ష్టం వాటిల్లిన‌ప్పుడు మాత్ర‌మే ఇన్ పుట్ స‌బ్సీడీల‌కు ఎదురుచూస్తారు... అలాంటి  రైత‌న్న‌ను కించ‌ప‌రిచే విధంగా బాబు మాట్లాడ‌టం ఇదేం మొద‌టి సారేం కాదు ఇంత‌కు ముందు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు చంద్ర‌బాబు. రైతుల ఓట్లు కావాలి కాని రైతుల బాధ‌లు అక్క‌ర్లేదు చంద్ర‌బాబుకు అని కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.