బ్రేకింగ్... టీడీపీ ప‌గ్గాలు ఎన్టీఆర్ చేతిలో

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-27 17:33:10

బ్రేకింగ్... టీడీపీ ప‌గ్గాలు ఎన్టీఆర్ చేతిలో

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇరు తెలుగు రాష్ట్రాల్లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని చంద్ర‌బాబు అనేక వ్యూహాలు ర‌చిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా టీడీపీ ప‌గ్గాల‌ను మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క రామారావు మ‌న‌వ‌డు మాజీ ఎమ్మెల్యే హ‌రికృష్ణ కుమారుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ కు పార్టీ ప‌గ్గాల‌ను అప్ప‌జెప్పేందుకు అధిష్టానం నిర్ణ‌యించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
2019లో ఏపీతో పాటు తెలంగాణ‌లో కూడా పార్టీని బ‌లోపేతం చేసేందుకు తెలంగాణ భాద్య‌త‌ల‌ను ఎన్టీఆర్ కు అప్ప‌జెప్ప‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. గతంలో పార్టీ త‌ర‌పున  అధికార టీఆర్ఎస్ నాయ‌కుల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టిన కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కొద్దిరోజుల క్రితం జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో పార్టీ తీర్థం తీసుకున్నారు.
 
ఆ త‌ర్వాత నుంచి టీడీపీలో బ‌ల‌మైన నాయ‌కుడు ఎవ్వ‌రు లేరు. ఇక ఈ మ‌ధ్య‌కాలంలో మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి చంద్ర‌బాబు పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇక ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు విని ఇరు తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌లు అవునా..! చంద్ర‌బాబు నాయుడు ఇంత దారుణానికి పాల్ప‌డ్డారా అంటూ ప్ర‌తీ ఒక్క‌రు ఆలోచిస్తున్నారు.
 
దీంతో తెలంగాణ‌లో అర‌కొర‌కు ఉన్న టీడీపీ నాయ‌కులు కాస్త ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. ఇక వారిని ఎలాగైనా పార్టీలో చేర్చుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార పార్టీ నాయ‌కుల‌కు గ‌ట్టి పోటీ ఇవ్వాల‌ని టీడీపీ అధిష్టానం భావిస్తుంది. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్ జ‌యంతి  జ‌న‌వ‌రి 9వ తేదినాడు తెలంగాణ టీడీపీ ప‌గ్గాల‌ను జూనియ‌ర్ ఎన్టీఆర్ కు ఆప్ప‌జెప్పేందుకు అధిష్టానం భావించిన‌ట్లు తెలుస్తోంది. చూడాలి మ‌రి ముఖ్య‌మంత్రి కేసీఆర్ గులాబి గాలికి కొత్త‌గా రాజ‌కీయ అరంగేట్రం చేస్తున్న ఎన్టీఆర్ ఎంత మేర‌కు పోటీ ఇవ్వ‌గ‌ల‌డు అనేది ప్ర‌శ్న‌గా మారుతోంది. చూద్దాం ఏం జ‌రుగుతుందో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.