చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-31 16:59:58

చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం

రాజ‌కీయాల‌కు ప్ర‌త్యేక పరిచయం అక్క‌ర్లేని వ్య‌క్తి  జేసీ దివాక‌ర్ రెడ్డి. ఈయ‌న అధికార పార్టీలో ఉన్నా, ప్ర‌తిప‌క్ష‌పార్టీలో ఉన్నా త‌ప్పుచేస్తే ఎవ‌రినైనా ముక్కు సూటిగా మాట్లాడే వ్య‌క్తి జేసీ దివాకర్ రెడ్డి. అందుకేనేమో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా ఈ నాలుగేళ్లపాల‌న‌లో త‌ప్పుచేసిన‌ట్లు తెలుస్తుంది అందుకే ఆయ‌న‌ను జేసీ దివాక‌ర్ రెడ్డి ప్ర‌శ్నించారు. 
 
మొన్న‌విజ‌య‌వాడ‌లో టీడీపీ నాయ‌కులు ఏర్పాటు చేసిన మినీ మ‌హానాడు స‌భ‌లో ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ. మ‌రోసారి చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి కావాల‌ని పొగుడుతూనే, మ‌రో వైపు అధికారంలో జ‌రిగిన త‌ప్పుల‌ను స‌భ స‌మ‌క్షంలో చంద్ర‌బాబుకు వివ‌రించారు. ప్ర‌తీ రోజు టెలీకాన్ఫ్ రెన్స్ చేయ‌డం వల్ల నియోజ‌కవర్గంలో ప‌నులు జ‌రుగ‌డంలేద‌ని, ప‌నుల కోసం వెళ్తే టెలీకాన్ఫ్ రెన్స్ ఉంద‌ని చెబుతున్నార‌ని జేసీ ఆరోపించారు. దీంతో పాటు జ‌న్మ‌భూమి క‌మిటీలు ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల‌ త‌మ‌కు చాలా ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని చంద్ర‌బాబుకు, జేసీ దివాక‌ర్ రెడ్డి వివ‌రించారు.
 
ఇక ఆయ‌న మాట‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న చంద్ర‌బాబు 24 గంటలు గ‌డవ‌క ముందే కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇంత‌కు చంద్ర‌బాబు ఏం నిర్ణయం తీసుకున్నారంటే కేవ‌లం నెల‌కు ఒక్క‌రోజు మాత్ర‌మే టెలీ కాన్ఫ‌రెన్స్ లు నిర్వ‌హించ‌నున్నామ‌ని, అలాగే ఫించ‌న్ల ఎంపిక కోసం ఉద్దేశించిన జ‌న్మ‌భూమి క‌మిటీల‌ను ఎత్తి వేస్తూ ఆన్ లైన్లో ఎవ‌రు అప్లై చేసినా జ‌న్మ‌భూమి క‌మిటీలతో సంబంధం లేకుండా ఎంపిక చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.
 
సాధార‌ణంగా చంద్ర‌బాబు నాయుడు ఎవ్వ‌రి మాట విన‌రు. ఆయ‌న చెప్పిందే వేదం ఆయ‌న చేసేదే ధ‌ర్మం కానీ ఈసారి జేసీ దివాక‌ర్ రెడ్డి ఆవేద‌న‌ను చూసి 24 నాలుగు గంట‌ల్లోగా త‌న మాట‌ను మార్చుకున్నారు. దీంతో ఎందుకైనా మంచిది  బాబు పాల్గొనే ప్ర‌తి బ‌హిరంగ స‌భ‌లోనూ జేసీ చేత మాట్లాడిస్తే మంచిదేమో అని ప్ర‌తీ ఒక్క‌రు భావిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.