టికెట్ పై ఆశ‌లు వ‌దులుకో బాలయ్య మిత్రుడుకి షాక్ ఇచ్చిన బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu and balakrishna
Updated:  2018-09-28 04:25:59

టికెట్ పై ఆశ‌లు వ‌దులుకో బాలయ్య మిత్రుడుకి షాక్ ఇచ్చిన బాబు

ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి ఎమ్మెల్యే బాబురావును ప్ర‌స్తుతం ఒక స‌మ‌స్య స‌వాల్ చేస్తోంది. ఈయ‌న అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాదు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వీయ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌కు ఆప్త మిత్రుడు బాబు రావు.  అయితే ప్ర‌స్తుతం ఈయ‌న‌ను ఒక స‌మ‌స్య వెంటాడుతోంద‌ని అంటుఅన్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అయితే ఈ స‌మ‌స్య బ‌య‌టి నుంచి వ‌చ్చిన‌ది కాదు సొంత పార్టీ నుంచే ఆయ‌న‌ను సెగ రేపుతోంది. ప్ర‌స్తుతం బాబు రావును 2019 టెన్ష‌న్ ప‌ట్టుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుస్తామా లేదా అన్న‌ది ఆయ‌న టెన్ష‌న్ వెన‌కున్న రీజ‌న్. అంతేకాదు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు అధిష్టానం టికెట్ ఇస్తుందా లేదా అన్నది ఆయ‌న‌తో పాటు ఆయ‌న వ‌ర్గానిక బీపీని పెంచుతోంది.
 
తాజాగా టీడీపీ అధికారంలోకి వ‌చ్చి నాలుగున్న‌ర సంవ‌త్సరాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంలో అధినేత చంద్ర‌బాబు నాయుడు ఎమ్మెల్యేల ప‌నితీరును అంచ‌నా వెయ్య‌డానికి నిర్వ‌హించిన వ‌రుస స‌ర్వేల్లో  ఎమ్మెల్యే బాబు రావుకు నెగిటివ్ మార్కులే వ‌చ్చాయ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ నాలున్న‌ర సంవ‌త్స‌రాల్లో ప్ర‌జ‌ల్లో బాబురావుపై వ్య‌తిరేక‌త తీవ్ర‌స్థాయిలో ఉంద‌ని తెలుస్తోంది. దీంతో చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ ఇస్తాడా లేదా అన్న‌ది ప్ర‌స్తుతం పెద్ద చ‌ర్చ‌. 
 
మ‌రో మూడు నెలల్లో ప్ర‌జల్లో టీడీపీ ప‌ట్ల సానుభుతి తీసుకురాకుంటే నెక్ట్స్ ఎల‌క్ష‌న్లో టికెట్ పై అవ‌కాశాలు వ‌దులుకోవాల‌ని బాబురావుకు బాబు వార్నింగ్ ఇచ్చార‌ని ప‌చ్చ‌కండువాలు గుస‌గుస‌లాడుతున్నాయి. ఒక వైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ వ‌స్తుందా లేదా అన్న అనుమానంతో ఉన్న బాబు మ‌రో వైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉగ్రన‌ర‌సింహా రెడ్డి టీడీపీకి ట‌చ్ లో ఉండ‌తంతో సిట్టింగ్ ఎమ్మెల్యేను తీవ్ర భ‌యాందోళ‌నకు చెందుతున్నార‌ట‌. 2014లో బాబు రావు చేతిలో ఉగ్ర‌న‌ర‌సింహారెడ్డి ఓట‌మిపాలు అయ్యారు.  
 
వీలైనంత త‌ర్వ‌గా సైకిల్ ఎక్కి 2019లో క‌నిగిరి టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చెయ్య‌లనే ఉద్దేశంలో న‌ర‌సింహారెడ్డి పావులు కుదుపుతున్న‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గెలుపు గుర్రాల‌కే టికెట్  ఇస్తామ‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసిన ఆయ‌న... రానున్న‌ రోజుల్లో న‌ర‌సింహాకు ప‌చ్చ‌కండువా వేసి క‌నిగిరి టికెట్ ఇవ్వ‌వ‌చ్చు అన్న చ‌ర్చ సాగుతోంది. ఇక ఈ నేప‌థ్యంలో బాబురావుకు ఉన్న ఒకే ఒక ఆశ, ఆయ‌న ద‌గ్గ‌ర ఉన్న‌బ్ర‌హ్మ‌స్త్రం నంద‌మూరి బాల‌కృష్ణ. ఎప్ప‌టి నుంచో బాల‌య్య బాబు రావు మంచి స్నేహితులు 2009, 2014లో కూడా బాల‌కృష్ణ కార‌ణంగానే బాబురావుకు టికెట్ వ‌చ్చింద‌ని తెలుగు త‌మ్ముళ్లు చెబుతున్నారు. 
 
దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ వ‌చ్చేలా చెయ్య‌లంటూ ఆ భారాన్ని మొత్తం బాబు రావు బాలయ్య మీద వేశార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి బాల‌కృష్ణ త‌న స్నేహితుడికి స‌హాయం చేసి అండ‌గా నిలుస్తారా !........ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఉగ్ర న‌ర‌సింహారెడ్డి వైపు మొగ్గు చూపుతారా! అన్న‌ది నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ సాగుతోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.