సోమిరెడ్డికి బిగ్ షాక్ ఇచ్చిన చంద్ర‌బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

somi reddy and chandrababu
Updated:  2018-08-23 11:13:12

సోమిరెడ్డికి బిగ్ షాక్ ఇచ్చిన చంద్ర‌బాబు

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు ఎంతో కాలంగా న‌మ్మిన బంటుగా ఉంటు వ‌స్తున్నారు మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి. అయితే ప్ర‌స్తుతం ఆయ‌న‌కు అధిస్టానం నుంచి ఉహించ‌ని షాక్ త‌గిలింది. గతంలో ఎన్న‌డులేని విధంగా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రాజ‌కీయ నాయ‌కుల వార‌సులు పొలిటిక‌ల్ ఎంట్రీ  చేయ‌నున్నారు.
 
దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌తో పాటు త‌మ‌కుమారుడుకి కూడా టికెట్ ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు లేఖ‌లు రాస్తున్నారు. అవ‌సరం అయితే త‌మ త‌మ సీటును త‌మ కూమారుడుకి కూడా ఇచ్చేందుకు సిద్ద‌మ‌య్యారు టీడీపీ నాయ‌కులు. అందులో ఎక్కువ‌గా అనంత‌పురం జిల్లా నుంచి ఎక్కువ‌గా సీఎం కార్యాలాయానికి లేఖ‌లు వెళ్తున్నాయి.
 
ఇక వార‌సులు లేని నాయ‌కులు అయితే త‌నకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు టికెట్ ఇవ్వాల‌ని కోరుతు నానా తిప్ప‌లుప‌డుతున్నారు టీడీపీ నాయ‌కులు. అయితే వీట‌న్నింటిపై చంద్ర‌బాబు ఎలాంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. తాజాగా చంద్ర‌బాబు ఓ విష‌యాన్ని మీడియాకు వివ‌రించారు. త్వ‌ర‌లో 40 మంది అభ్యర్థుల‌తో కూడిన ఓ జాభితాను విడుద‌ల చేస్తాన‌ని తెలిపిందిఅధిష్టానం. అందులో త‌న పేరు తోపాటు త‌న కుమారుడు పేరు కూడా ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని సోమిరెడ్డి ఎంతో ఆశ‌గా ఉన్నారు. 
 
తెలుగుదేశం పార్టీ త‌ర‌పున చక్రం తిప్తే ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌తో పాటు త‌న కుమారుడికి కూడా టికెట్ ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిని గ‌త కొద్దికాలంగా కోరుతున్నారు.  అయితే ఈ అభ్య‌రంత‌రాల‌పై అధిష్టానం ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. వాస్త‌వానికి వ‌రుస పెట్టి ప‌రాజ‌యం పాలు అవుతున్న సోమిరెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న కుమారుడి టికెట్ ఇస్తే పోయిపోయి వైసీపీకి విజ‌యం క‌ట్ట‌బెట్టిన‌ట్లు అవుతుంద‌ని భావించి చంద్ర‌బాబు నాయుడు 40మంది జాభితాలో ఆయ‌న కుమారుడి పేరు చేర్చ‌లేద‌ని తెలుస్తోంది. 
 
కేవ‌లం సోమిరెడ్డి పేరు మాత్ర‌మే చేర్చింది అధిష్టానం. దీంతో ఆయ‌న టెన్ష‌న్ ప‌డుతున్నారు. వ‌చ్చేఎన్నికల్లో తాను పోటీ చేయ్యాలా త‌న వార‌సుని భ‌రిలో దింపాలా అని విష‌యాన్ని ధీర్ఘంగా ఆలోచిస్తున్నాట్లు తెలుస్తోంది. అయితే అదికూడా స‌ర్వేప‌ల్లి కేటాయించ‌డం ఎంట‌ని ఆయ‌న మ‌ద‌న ప‌డుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.