టీడీపీ ని షేక్ చేసే విషయం.. చంద్రబాబు కుదేలవడం ఖాయం..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

babu
Updated:  2018-10-13 14:52:48

టీడీపీ ని షేక్ చేసే విషయం.. చంద్రబాబు కుదేలవడం ఖాయం..

ఏపీ రాజకీయాల్లో, టీడీపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు క్రియేట్ కాబోతున్నాయట..ఇంతవరకు స్తబ్దుగా ఉన్న రాజకీయాన్ని కొత్త మలుపు తిప్పబోతుందట.. మరి అటువంటి షేకింగ్ న్యూస్ ఏంటి.. టీడీపీలో కీలకంగా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు జనసేన కండువా కపుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. వారిలో ఇద్దరు గుంటూర్ జిల్లాకు చెందిన వారు అయితే, ఒకరు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారు.
 
గుంటూర్ నుంచి మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, తూర్పు నుంచి తోట త్రిమూర్తులు టీడీపీకి హ్యాండ్ ఇచ్చి జనసేనలో చేరుతున్నారట. వివిధ కారణాల వల్ల వీరంతా చంద్రబాబు తో విభేదిస్తూ కొంతకాలంగా అసంత్రుప్తితో ఉన్నట్లు టాక్.ఇలా ఒక్క మాటున ముగ్గురు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు జంప్ చేస్తే అది సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. ఇప్పటి వరకు జనసేనలో పెద్ద నాయకులు ఎవరూ చేరలేదు. ఇపుడు నాదెండ్ల మనోహర్ తో బోణీ పడిండి. ఆ వరసలో మరో ముగ్గురు కీలక నేతలు చేరితే జనసేనకు ఊపు వస్తుంది.
 
అదే టైంలో టీడీపీకి భారీ షాక్ తగులుతుంది. పసుపు శిబిరంలో సైతం గుబులు చెలరేగుతుంది.ఇక టీడీపీ నుంచి ఒకేమారు ముగ్గురు ఎమ్మెల్యేలు సైకిల్ దిగి ప్రతిపక్షంలో చేరితే అది కచ్చితంగా పెద్ద దెబ్బేనని అంటున్నారు. రేపటి ఎన్నికల్లో గెలుస్తామని ఇప్పటికే డప్పు కొట్టుకుంటున్న టీడీపీ డిఫెన్స్ లో పడడం ఖాయమని కూడా చెబుతున్నారు. మరి అంతటి విపత్కర పరిస్తితి రాకుండా బాబు చివరి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా లేదా అన్నది కొద్ది గంటల్లో తేలిపోతుంది. ఏది ఏమైనా జనసేన మెల్ల మెల్లగా పావులు కదుపుతోందని తెలుస్తోంది.
 

షేర్ :

Comments

0 Comment