బాబు కొత్త షో

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-12 11:18:38

బాబు కొత్త షో

నాలుగేళ్లుగా అన్యాయం జ‌రుగుతున్నా స‌హించాం, భ‌రించాం... ఇక మీకు వంత పాడేది లేదు... ఏపీకి విభ‌జ‌న హామీలు ఇవ్వ‌డం లేదు అని... తెలుగుదేశం నాయ‌కులు బీజేపీని సెంట‌ర్ చేస్తూ ఫైర్ అవుతున్నారు.. వారం రోజులుగా జ‌రుగుతున్న ఈ  పొలిటిక‌ల్ గేమ్ అంతా తెలిసిందే... పార్ల‌మెంట్ స‌మావేశాలు అయిపోయినా స‌రే, ఏపీకి గ్రీన్ సిగ్న‌ల్ అన్నింటికి కేంద్రం ఒకే చెప్పింది అని, ఆస్దాన మీడియాల‌లో వార్త‌లు హైలెట్ చేసింది తెలుగుదేశం పార్టీ.. అయితే ఎంత గింజుకున్నా ఆ గింజ‌లే అని... చివ‌ర‌కు తాము సాయం చేస్తాం ఏపీకి మేము వెనుక ఉన్నాం అని ఓ విధ‌మైన భ‌రోసా క‌ల్పిస్తోంది బీజేపీ.
 
అయితే ఇచ్చింది ఆవ‌గింజంత చెప్పేది ప‌న‌స‌తొనంత అని, బీజేపీ అన్ని త‌ప్పుడు లెక్క‌లు చెబుతోందని,  27 పేజీల ఏపీ నిధుల చిట్టా అంతా కూడా తూచ్ అంటున్నారు తెలుగుదేశం నేత‌లు... అయితే ఆ నోట్ విడుద‌ల చేసింది ఎంపీ హ‌రిబాబు, అయితే ఆయ‌న మాట కూడా త‌ప్పు అని బాబు కోట‌రి అంటోంది... అంటే ఏ లెక్క‌న బీజేపీని సెంట‌ర్ చేసి ప్ర‌జ‌ల్లో ఎల్లోరంగు పూయాల‌నుకుంటోందో ఇట్టే అర్ధం అయిపోతోంది అంటున్నారు బీజేపీ నాయ‌కులు.
 
బాబు తాజాగా కొత్త షోకు తెర‌లేపారు... తెలుగుదేశం ఎంపీల‌తో స‌మావేశ‌మై ఎంత వ‌ర‌కూ అయినా వెళ‌దాం.. బీజేపీ పై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టాలి... బ‌డ్జెట్ లో మ‌న‌కు మెండిచెయ్యి చూపించిన బీజేపీ స‌ర్కారుకు, చంద్ర‌మండ‌లంలో చుక్క‌లు చూపించాలి అనే విధంగా కొత్త ప్ర‌ణాళిక ఇచ్చారు... అదే ఫార్మూల‌ను తెలుగుదేశం నాయ‌కులు ఇంప్లిమెంట్ చేస్తున్నారు...
 
అయితే ఈ నాలుగేళ్లు మౌనవ్ర‌తం వ‌హించిన బాబు, తాజాగా ఉగ్ర‌రూపావ‌తారం పోషించి బీజేపీని భ‌య‌పెట్టాలి అని అనుకుంటున్నార‌ని వైసీపీ మండిప‌డుతోంది.... అయితే వైసీపీ నాయ‌కులు బాబు పై ఓ రేంజ్ కౌంట‌ర్ వేస్తున్నారు.. ఈ నాలుగేళ్లు బాబు చేసిన ప‌నులు - ప‌థ‌కాలు బీజేపీలో ఇప్పుడు ఆడుతున్న గిల్లిగ‌జ్జాలు అన్ని క‌లిపి ఓ సినిమా తీస్తే, టికెట్ 150 పెట్టినా జ‌నాలు కొని సినిమా చూస్తారు అంటున్నారు.
 
అస‌లు మీడియాలో ఇంత ర‌చ్చ చేయించే క‌న్నా, త‌న మంత్రుల‌ను కేబినెట్ నుంచి బ‌య‌ట‌కు తీసుకువ‌స్తే మోదీ క‌చ్చితంగా ఏపీపై ఓ స‌రైన నిర్ణ‌యం తీసుకుంటారు అని వైసీపీ ఆనాటి నుంచి నేటికి చెబుతోంది.. బాబు - తెలుగుదేశం నాయ‌కులు మాత్రం వైసీపీ ఎంపీల‌ను రాజీనామా చేయాలి అని కోర‌డం వెనుక అస‌లు నిజాయ‌తీ ఉందా అని కొంద‌రు సీనియ‌ర్లు విమ‌ర్శిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.