చుట్టుముడుతున్న స‌మ‌స్య‌లు ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-08 16:12:57

చుట్టుముడుతున్న స‌మ‌స్య‌లు ?

2019 ఎన్నిక‌లకు ఏడాది కూడా స‌మ‌యం లేని క్ర‌మంలో ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌ల‌పై ఒక స‌మ‌స్య పూర్తికాక ముందే మ‌రో స‌మ‌స్య తెర‌పైకి వ‌స్తోంది... 2014 ఎన్నిక‌ల్లో సుమారు ఆరువంద‌ల‌కు పైగా హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి  వ‌చ్చిన చంద్ర‌బాబు, నాలుగు సంవ‌త్స‌రాలు గ‌డిచినా ఒక్క హామీని కూడా స‌క్ర‌మంగా అమ‌లు చేయ‌లేదని, ప్ర‌జ‌లు విమ‌ర్శిస్తున్నారు... 
 
ఇక దీంతో పాటు చంద్ర‌బాబు తాము అధికారంలోకి వ‌స్తే కాపుల‌ను బీసీల్లోకి చేర్చుతామని హామీ ఇచ్చారు... వాస్త‌వానికి కాపులు త‌మ‌ను బీసీల్లో చేర్చాల‌ని ఉద్య‌మాలు, రాస్తారోకోలు చేయ‌లేదు...ఇది కేవ‌లం 2014  ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు  హామీయే అని ప్ర‌జ‌లు చెబుతున్నస‌త్యం.
 
ఇక కాపుల‌ను బీసీల్లో చేరుస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు ప్ర‌జ‌లంద‌రూ క‌లిసి సైకిల్ పార్టీని అధికారంలోకి తెచ్చారు... అలా కాపుల అండ‌తో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి అయినా కానీ, వారి రిజ‌ర్వేష‌న్ల ప్ర‌స్తావ‌న గురించి అసెంబ్లీలో ఒక్క‌సారి కూడా ప్ర‌స్తావించ‌లేదు.
 
దీంతో మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం,చంద్ర‌బాబు కాపుల‌ను మోసం చేస్తున్నార‌నే విష‌యాన్ని గ‌మ‌నించారు... ఇక కాపు రిజ‌ర్వేన్ పోరాటంపై ముద్ర‌గ‌డ‌ త‌న స్వ‌గ్రామం నుంచి అమ‌రావ‌తికి పాద‌యాత్ర‌కు పిలుపునిచ్చారు... అయితే ఈ పాద‌యాత్ర‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు శాంతి భ‌ద్ర‌త‌ల ధృష్ట్యా  ఆయ‌న‌ను హౌస్ అరెస్ట్ చేయించారు.. దీంతో ఏపీలో  టీడీపీ వ‌ర్సెస్ కాపు అన్న‌ట్లుగా మారింది.
 
ఒక తాజాగా  బీసీలు కూడా చంద్ర‌బాబుకుపై ఆగ్రహంతో ఉన్నార‌ని తెలుస్తోంది..ద‌శాబ్దాల పాటు తెలుగు దేశం పార్టీకి అండ‌గా నిలుస్తోన్న బీసీల‌ను... చంద్ర‌బాబు నాయుడు కూర‌లో క‌రివేపాకులాగ తీసిపారేస్తున్నార‌ని మండిప‌డున్నారు... గ‌త ఎన్నిక‌ల్లో కాపుల‌తో పాటు  బీసీల‌ను ఎస్టీల్లో  చేర్చుతాన‌ని ముఖ్య‌మంత్రి హామీ ఇచ్చారు... అయితే వాటి ప్ర‌స్తావ‌న కూడా చంద్ర‌బాబు తుంగ‌లో తోసేశార‌ని బీసీలు మండిప‌డుత‌న్నారు... ఇలా ఎంతో మందికి తాము అధికారంలోకి వ‌స్తే అది చేస్తాం.. ఇది చేస్తాం అని చేప్పి ప్ర‌జ‌ల ఓట్ల‌ను రాబ‌ట్టుకున్నార‌ని ప‌లు చోట్ల విమ‌ర్శ‌లు చేస్తున్నారు ప్ర‌జ‌లు.
 
ఇక దీంతో పాటు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి విచార‌ణ కూడా శ‌ర వేగంగా చేయిస్తున్నారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్... ఈ క్ర‌మంతో ఈ కేసుకు సంబంధించి చండీగఢ్ ఫోరెన్సిక్ నివేదిక వ‌చ్చింది..  దీంతో వ‌చ్చే నెల‌లో ఈ కేసు కోర్టు ముందుకు రానుండ‌టంతో  ఈ కేసు పై పురోగ‌తి సాధించాలి అని తెలంగాణ స‌ర్కారు భావించింది... సీఎం చంద్ర‌బాబు డీజీపీ అలాగే ఏసీబీ అధికారులు మాజీ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ తో సీఎం కేసీఆర్  ఈ కేసు విషయం పై చ‌ర్చించారు.... ఈ కేసు పై వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు ఆయ‌న.. ఇక వ‌చ్చే వారం ఈ కేసుపై ఓ తుది గ్రాఫ్ క‌నిపిస్తుంది అని చ‌ర్చించుకుంటున్నారు ఇరు తెలుగు రాష్ట్రాల్లో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.