కుప్పంలో కుప్పకూలిన‌ స‌ర్వే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-13 16:15:51

కుప్పంలో కుప్పకూలిన‌ స‌ర్వే

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న క్రమంలో ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశంపార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు నేత్రుత్వంలో టీడీపీ ప‌ట్టు ప్ర‌జ‌ల్లో ఎలా ఉందో తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సర్వేల‌ను నిర్వ‌హిస్తున్నారు.అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నాలుగు నెల‌ల‌పాటు నిర్వ‌హించిన ఈ స‌ర్వేతో టీడీపీ నాయ‌కులకు ఊహించ‌ని షాక్ తుగులుతోందట‌. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌స్తాయా త‌మ ఓటుతో చంద్ర‌బాబుకు త‌గిన బుద్ది చెబుదామా అనే ఉద్దేశ్యంతో ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నార‌ని ఈ స‌ర్వేలో తేలింద‌ట‌.
 
ఇక చివ‌రిగా చంద్ర‌బాబు  నాయుడు త‌న నియోజ‌క‌వ‌ర్గం అయిన కుప్పం నియోజ‌కవ‌ర్గంలో స‌ర్వే నిర్వ‌హించార‌ట‌. మొద‌ట్లో చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయ అరంగేట్రం చేసిప్పుడు కాంగ్రెస్ త‌ర‌పున చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు త‌న ప్ర‌త్య‌ర్థిపై ఘోర ప‌రాజ‌యం ఎదుర్కొన్నారు. ఇక అక్క‌డ‌నుంచి ప్ర‌త్య‌ర్థుల బ‌లం త‌క్కువగా ఉన్న సెగ్మెంట్ ను చూసుకుని కుప్పం నియోజ‌కవ‌ర్గం వైపు మ‌కాం వేశారు.
 
ఇక అప్ప‌టినుంచి ప్ర‌తీ సార్వ‌త్రిక ఎన్నికల్లో కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచి చంద్ర‌బాబు పోటీ చేస్తూ విజ‌యం సాధిస్తున్నారు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో కూడా చంద్ర‌బాబు త‌న ప్ర‌త్య‌ర్థి చంద్ర‌మౌళిపై అత్య‌ధిక మెజారిటీతో గెలిచారు. ఇక  2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో త‌న ప‌ట్టు ప్ర‌జ‌ల్లో ఎలా ఉందో అని ఒక స‌ర్వే నిర్వ‌హించారు. చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు సర్వే నిర్వ‌హించార‌ట‌. ఎవ‌రైనా ఏ పార్టీ నాయ‌కులు త‌రుపున‌ సర్వేనిర్వ‌హిస్తున్నారు అని కుప్పం ప్ర‌జ‌లు అడిగితే వైసీపీ,లేక జ‌న‌సేన, బీజేపీ నుంచి వ‌చ్చామ‌ని చెప్పాలని అప్పుడే జ‌నాలు టీడీపీ పై త‌మ అభిప్రాయాలు చెబుతార‌ని అధిష్టానం సూచించింద‌ట‌. 
 
దీంతో అధిష్టానం కోరిక‌మేర‌కు స‌ర్వే నిర్వ‌హించి ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను తెలుసుకున్నారు. చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌స్తే త‌మ నియోజ‌కవ‌ర్గంలో అభివృద్ది జ‌రుగుతుంద‌ని, అలాగే గ‌డిచిన ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన హామీల‌ను చూసి త‌మ జిల్లాకు ఉద్యోగాలు వ‌స్తాయ‌ని భావించి టీడీపీకి ఓట్లు వేశామ‌ని అన్నారట‌. అయితే చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత త‌మ నియోజిక‌వ‌ర్గాన్నిప‌ట్టించుకోవ‌డ‌మే మ‌ర్చిపోయార‌ని ప్ర‌జ‌లు వారి అభిప్రాయాల‌ను చెప్పార‌ట‌. అంతే కాదు వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకే ఓటు వేప్తామ‌ని బ‌హిరంగంగానే చెబుతున్నార‌ట‌. 
 
ఇక మ‌రోవైపు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కుప్పం నియోజ‌కవ‌ర్గం నుంచి చంద్ర‌బాబు త‌న కుమారుడిని పోటీ చేయించి ఆయ‌న టీడీపీకి కంచుకోట‌గా వ‌స్తున్న కృష్ణా, లేక గుంటూరు జిల్లాల్లో ఏదో ఒక నియోజ‌కవ‌ర్గం నుంచి పోటీ చేసేందుకు చంద్ర‌బాబు స‌న్న‌హాలు చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మొత్తానిక జ‌గ‌న్ ఎఫెక్ట్ చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గానికి కూడా తాకింద‌నే చెప్పాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.