ఇది అద్భుత‌మైన కాలం అన్ని క‌లిసి వ‌స్తున్నాయి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu
Updated:  2018-08-21 01:59:35

ఇది అద్భుత‌మైన కాలం అన్ని క‌లిసి వ‌స్తున్నాయి

ప్ర‌స్తుతం మ‌న‌మంద‌రం అద్భుత‌మైన కాలంలో ఉన్నామ‌ని అందుకే మ‌నం అనుకున్న‌వ‌న్ని జ‌ర‌గిపోతున్నాయ‌ని ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స్ప‌ష్టం చేశారు. ఈ రోజు స‌చివాలయంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ప‌రెన్స్‌ కాల్లో జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో మాట్లాడుతూ, అనుకున్నవ‌న్ని జ‌రుగ‌డం ఇదే మంచి త‌రుణం అని అన్నారు.
 
మూడు సంవ‌త్స‌రాలుగా రాష్ట్రంలో సుల‌భ‌త‌ర వ్యాపారం చేస్తు ముందుకు వెళ్తున్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత 10.5 శాతం వృద్ది రేటు సాధించామ‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. అత్యంత ఆహ్ల‌ద‌క‌ర‌మైన, సుర‌క్షిత‌మైన ప్రాంతంగా తిరుప‌తి న‌గ‌రం దేశంలో రెండో స్థానంలో ఉంద‌ని చెప్పారు.
 
తిరుప‌తి విజ‌య‌వాడ న‌గ‌రాలు మెరుగైన జీవ‌నం సాగించేందుకు వీలున్న న‌గ‌రాలుగా నిలిచాయ‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. అంతేకాదు గ్రామాల్లో అభివృద్ది ప్ర‌ణాళిక‌ల‌ను ఏర్పాటు చెయ్యాల‌ని అధికారుల‌కు సూచించారు. గ్రామ‌ద‌ర్శి ప్రోగ్రామ్ ఇప్ప‌టివ‌ర‌కు 20 శాతం మాత్ర‌మే పూర్తి అయింద‌ని డిసెంబ‌ర్ లోపు పూర్తి చెయ్యాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆదేశించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.