కేఈ కి టార్గెట్ పెట్టిన చంద్ర‌బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-26 16:41:35

కేఈ కి టార్గెట్ పెట్టిన చంద్ర‌బాబు

తాడేప‌ల్లి గూడెం ఎమ్మెల్యే బీజేపీ త‌ర‌పున టికెట్ పొంది మిత్ర‌బంధంలో మంత్రి ప‌ద‌వి పొందారు ఎమ్మెల్యే పైడి కొండ‌ల మాణిక్యాల‌రావు.. చివ‌ర‌కు నాలుగు సంవ‌త్స‌రాల రాజ‌కీయ బంధానికి తెలుగుదేశం ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు... చివ‌ర‌కు రాజీనామాల అస్త్రంలో తెలుగుదేశం బాగానే ఉన్నా బీజేపీ త‌న ఉనికి ఉన్న ప్రాంతాల‌లో ప‌ట్టుకోల్పోయింది అంటున్నారు విశ్లేష‌కులు.. 
 
ఇటు కామినేని అటు మాణిక్యాల‌రావు మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌గానే తెలుగుదేశంలో గ‌త సంవ‌త్స‌రంగా అల‌క‌లు బూనిన నాయ‌కుల‌కు ఆ ప‌ద‌వులు క‌ట్ట‌బెడ‌తారు బాబు అని అనుకున్నారు.. ప్ర‌కాశం లో గొట్టిపాటి వ‌ర్గంతో వైరం ఉన్న ఎమ్మెల్సీ  క‌ర‌ణం బ‌ల‌రాంకు మంత్రి ప‌ద‌వి ఇస్తారు అని అనుకున్నారు.. ఇటు శాఖ‌ను మార్చి ఏదో ఓ మంత్రి ప‌ద‌వి మైనార్టీకి ఇస్తారు అని ఆ లోటును భ‌ర్తీ చేస్తారు అని అనుకున్నారు అంద‌రూ..
 
అయితే ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే  ఈ అత్యుత్సాహం ఎందుకు అని బాబు గ్ర‌హించి కేంద్రం మ‌రింత ఆగ్ర‌హం అవుతుంది అని ఊహించి ఆ నిర్ణ‌యానికి ఫుల్ స్టాప్ పెట్టారు... కాని అన్ని రాష్ట్రాల బాగోగులు కేంద్రం మంత్రులు చూడాలి కాబ‌ట్టి  కేంద్రం విమాన‌యాన శాఖ‌మంత్రిగా సురేష్ ప్ర‌భుకు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించింది దీంతో  కేంద్రంలో అశోక్ గ‌జ‌ప‌తి రాజు లెక్క‌స‌రిపోయింది.
 
అయితే ఏపీలో దేవాదాయ ధ‌ర్మధాయ శాఖ బాధ్య‌త‌లు సీఎం చంద్ర‌బాబు త‌న ద‌గ్గ‌రే ఉంచుకున్నారు.. అయితే ఈ నెల 8న వారు చేసిన రాజీనామాల త‌ర్వాత ఆ రెండు శాఖ‌లు బాబు వ‌ద్దే ఉంచుకున్న విష‌యం అంద‌రికి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వద్ద ఉన్న పదవుల్లో దేవదాయ శాఖను మాత్రం కేఈ కృష్ణమూర్తికి అదనంగా అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌  ఉత్తర్వులు జారీ చేశారు.
 
అయితే ఇప్ప‌టికే కే.ఈ మంత్రి ప‌ద‌వుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు, ఇటు రాయ‌ల‌సీమలో పార్టీకి పెద్ద‌గా ఉన్నారు.. ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లో  కేఈకు మంత్రి ప‌ద‌వితో పాటు ఈ అధ‌న‌పు బాధ్య‌తలు ఇవ్వ‌డం వెనుక మ‌త‌ల‌బు ఏమిటి అనే ఆలోచ‌న వ‌స్తోంది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచీ దేవదాయ శాఖ బాధ్యతలు చేపట్టిన నాయకులు పలువురు కొద్ది కాలానికే పదవీచ్యుతులు అవుతారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పదవిని తన వద్ద ఉంచుకోవడానికి ఏ మాత్రం ఆసక్తి చూపలేదని తెలుగుదేశం పార్టీ వర్గాలే అంటున్నాయి.. ఎలాగో కే.ఈకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే ఉద్దేశ్యం లేద‌ని... కుమారుడు శ్యాంబాబును ఎన్నిక‌ల్లో దించే అవ‌కాశం ఉంది అంటున్నారు మ‌రి అందుకే ముందుగానే బాబు ఇటువంటి ప్లాన్ వేశారా అనే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.