చంద్ర‌బాబుకు విజ‌య‌సాయిరెడ్డి న్యూ పంచ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu- saireddy image
Updated:  2018-03-28 04:08:01

చంద్ర‌బాబుకు విజ‌య‌సాయిరెడ్డి న్యూ పంచ్

ఊస‌రవెల్లి అనే ప‌దం వైసీపీ రోజూ ఎక్క‌డో చోట  ప్ర‌స్తావిస్తూనే ఉంది.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏపీకి ప్ర‌త్యేక హూదా కావాలి, అలాగే మ‌రోసారి ఏపీకి ప్ర‌త్యేక హూదా వ‌ద్దు ప్ర‌త్యేక ప్యాకేజీ బాగుంది, హూదా ఏమైనా సంజీవనా అని ప‌లుసార్లు అన్న విష‌యం తెలిసిందే... అయితే ప్ర‌త్యేక హూదా విష‌యంలో తెలుగుదేశం పార్టీ ఎన్ని యూట‌ర్న్ లు తీసుకుందో తెలిసిందే అని వైసీపీ విమ‌ర్శిస్తోంది.
 
హూదా గురించి చెప్పి ప్యాకేజీ గురించి చ‌ర్చించి ఇష్టం వ‌చ్చిన రీతిలో జ‌నాల్ని మోసం చేస్తున్న తెలుగుదేశం పార్టీ పూట‌కో మాట రోజుకో ఆట ఆడుతున్నాయి అని అన్నారు... చంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఫైర్ అయ్యారు..చంద్రబాబు యూటర్న్‌ అంకుల్‌అని, ఇకనైనా ఏదోఒక స్టాండ్‌పై నిలబడటం నేర్చుకోవాలని అన్నారు.
 
యూటర్న్‌ అంకుల్‌ చంద్రబాబు నిన్న అఖిలపక్షం నిర్వహించారు. అదికాస్తా విఫలపక్ష సమావేశమైంది. నాలుగేళ్లుగా రోజుకో మాట చెబుతున్న ఆయనను ఏ ఒక్కరూ నమ్మడంలేదు. నిన్నటి సమావేశంతో ఆయన ఏమీ సాధించలేకపోయారు. ప్యాకేజీలో డబ్బులు సంపాదించుకోవాలనుకున్నారు. తీరా అది కూడా దక్కకపోవడంతో మళ్లీ హోదా కావాలంటున్నారు..
 
ఇవేనా విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాలు అని ఆయ‌న ఫైర్ అయ్యారు.. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు అయిన యూటర్న్‌ అంకుల్ కు నా  విజ్ఞప్తి ఒక్కటే. ఇప్పటికైనా హోదా టాపిక్‌ను డైవర్ట్‌ చేయాలనే కుట్రలు మానుకోండి. రాష్ట్రానికి, ప్రజలకు ద్రోహం చేయకండి.. ఒక్క స్టాండ్‌ మీద నిలబడండి..’ అని విజయసాయి అన్నారు.
 
ఇక అలాగే తెలంగాణ ఉద్య‌మం గురించి ఆ నాటి ప‌రిస్దితుల గురించి కూడా తెలియ‌చేశారు విజ‌య‌సాయిరెడ్డి..
తెలంగాణ ఉద్యమ సమయంలో గొంగళి పురుగునైనా ముద్దాడుతానన్న కేసీఆర్‌ మాటలను గుర్తుచేశారు. ఇలా ఏపీకి ప్ర‌త్యేకహూదా  విష‌యంలో చంద్ర‌బాబు వ్య‌వ‌హరించ‌గ‌ల‌రా అని అన్నారు.. జ‌గ‌న్ ఒక్కరే నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నారు అని, కాని ఇప్పుడు యూట‌ర్న్ అంకుల్ స‌ర్టిఫికెట్ మాకు అక్క‌ర్లేదు అని అన్నారు విజ‌య‌సాయిరెడ్డి. చంద్ర‌బాబు చేస్తున్న‌టువంటి రాజ‌కీయాలు ప్ర‌జ‌లు అంద‌రూ గ‌మనిస్తున్నారు అని అన్నారు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.