చంద్ర‌బాబు వార్నింగా?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-19 18:04:57

చంద్ర‌బాబు వార్నింగా?

తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు వార్నింగ్ ఇచ్చారు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి... నిన్న హనుమాన్ జంక్షన్ లో చోటు చేసుకున్న ఘటన‌పై ముఖ్య‌మంత్రి స్పందిస్తూ వెంట‌నే చింత‌మ‌నేని పార్టీ ఆఫీస్ కు హాజ‌రు కావాల‌ని ఆదేశించిన‌ట్లు తెలుస్తోంది..ఈ విష‌యంపై ప్ర‌తీ ఒక్క‌రు చ‌ర్చించుకుంటున్నారు, సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న సంద‌ర్భంలో  చింత‌మ‌నేని ఇలాంటి ఘ‌ట‌న‌కు పాల్ప‌డ‌డంపై చంద్ర‌బాబు తీవ్రంగా ఆగ్రహం వ్య‌క్తం చేశారని తెలుస్తోంది.
 
ఇంత‌కు నిన్న ఏం జ‌రిగిందంటే... ఓ ఆర్టీసీ బస్సుపై ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఉన్న ఓ చిత్రంపై చంద్రబాబు ముఖాన్ని ఎవరో  గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు చించేశారు... దీన్ని గమనించిన చింతమనేని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు... అయితే వెంటనే ఆ బస్సును అక్కడే నిలిపివేసి డ్రైవర్, కండక్టర్లను పై మండిప‌డ్డారు చింత‌మ‌నేని.. అలాగే ప్ర‌యాణికుల‌పై ఆగ్రహం చెంది వారిని వేరే బ‌స్సులో ఎక్కించేలా అధికారుల‌ను ఆదేశించారు... దీంతో అక్కడి ప‌రిస్థితి గంద‌ర‌గోలంగా మారింది.. అయితే ఈ క్ర‌మంలో గరికపాటి నాగేశ్వరరావు అనే ప్ర‌యాణికుడు బ‌స్సును ఎందుకు ఆపార‌ని ప్ర‌శ్నించ‌గా అతనిపై చింతమనేని చేయి చేసుకున్నారు.
 
దీంతో ఈ ఘ‌ట‌న‌పై కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు స్పందిస్తూ  హనుమాన్ జంక్షన్ లో భారీ ఎత్తున చింత‌మ‌నేని ప్ర‌భాకర్ పై నిరస‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు... ఈ నిర‌స‌న‌లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు కూడా పాల్గొని టీడీపీ నాయ‌కుల‌ను నిర‌సిస్తూ నిరస‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు... ఈ నేపథ్యంలో  చింతమనేనిపై ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు... ఎవ‌రో చేసిన త‌ప్పుకు ఆర్టీసీ సిబ్బందిని ప్ర‌శ్నించ‌డం చాలా అవ‌మానక‌రంగా ఉంద‌ని అంటున్నారు.
 
అయితే ఈ విష‌యంపై చంద్ర‌బాబు నాయుడు సీరియ‌స్ అయ్యారు.. అధికారంలో ఉన్న నాయ‌కులు ఇలాంటి ప‌నుల‌కు పాల్ప‌డ‌డం వ‌ల్ల పార్టీకి చెడ్డ‌పేరు వ‌స్తుంద‌ని, చింత‌మ‌నేనిని వెంట‌నే పార్టీ ఆఫీస్ కు వ‌చ్చి త‌మ‌ను క‌ల‌వాల‌ని చంద్ర‌బాబు ఆదేశించిన‌ట్లు తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.