పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తా ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేల‌కు బాబు వార్నింగ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-27 18:56:03

పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తా ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేల‌కు బాబు వార్నింగ్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తిరుప‌తి ఎయిర్ పోర్ట్ లో ఈ రోజు ప్రోటోకాల్ విషయంలో చిత్తూరు జాయింట్ క‌లెక్ట‌ర్ గిరిషా పై, వీరంగం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విష‌యంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని బొల్లినేనికి వార్నింగ్ ఇచ్చారు
 
అమ‌రావ‌తిలో టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీలో ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేదిలేద‌ని ఇందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన‌ ప‌రిస్థితి వ‌స్తుంద‌ని బొల్లినేని రామారావును హెచ్చ‌రించారు.
 
అలాగే పెందుర్తి ఎమ్మెల్యే వెంక‌టేష్ కు కూడా చంద్ర‌బాబు వార్నింగ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో  త‌న‌కు నిధుల‌ను కేటాయించాల‌ని స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాలయాన్ని ముట్ట‌డించారు. ఒక అధికార పార్టీలో ఉండి క‌లెక్టర్ ముట్ట‌డి కార్య‌క్ర‌మాలు చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం దీనివ‌ల్ల పార్టీకి ఎంత చెడ్డ‌పేర‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క్లాస్ తీసుకున్నారు. 
 
ఇక నుంచి ఎవ‌రైనా కూడా ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు తెలిసినా పార్టీ దిగ‌జారుడుకు పాల్ప‌డినా వారిని వ‌దులుకునేందుకు తాను సిద్దంగా ఉన్నాన‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. ఈ విష‌య‌మే కాదు గ‌త కొద్దికాలంగా వీరిద్ద‌రిపై పార్టీ ప‌రంగా అనేక విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. ఇక నుంచి అయినా స‌క్ర‌మంగా ప‌నులు చెయ్యాల‌ని లేకపోతే మీరిద్ద‌రిని వ‌దులుకోవ‌డానికి కూడా తాను సిద్ద‌మ‌వుతాన‌ని చంద్ర‌బాబు తెలిపిన‌ట్లు తెలుస్తోంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.