బాబు వ్యాపారం ఎలా చేస్తారో చెప్పిన జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagnmohanreddy
Updated:  2018-04-23 05:54:00

బాబు వ్యాపారం ఎలా చేస్తారో చెప్పిన జ‌గ‌న్

ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన‌ ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ కంచుకోట కృష్ణా జిల్లా నూజివీడు సెగ్మెంట్ లోని గన్నవరంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా బ్రహ్మలింగయ్య చెరువును వైఎస్ జగన్ ప‌రిశీలించారు.. ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పరిపాల‌నను చూస్తుంటే చాలా ఆశ్చ‌ర్యంగా  క‌నిపిస్తోంద‌ని ఎద్దేవా చేశారు.
 
టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌జ‌లకే కాదు ప‌విత్ర‌మైన దేవుని గుళ్ల‌కు కూడా ర‌క్ష‌ణ లేకుండాపోతుంద‌ని జ‌గ‌న్ ఆరోపించారు.. నీరు - చెట్టు ప‌థ‌కం పేరు కింద  అమ‌రావ‌తి ప్రాంతాల్లో నాలుగు సంవ‌త్స‌రాల నుంచి  అక్ర‌మంగా ఇసుక, మ‌ట్టిని టార్గెట్ చేస్తూ విచ్చ‌ల‌విడిగా సైకిల్ పార్టీ నాయ‌కులు అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని జ‌గ‌న్ తెలిపారు.. మ‌ట్టితో వ్యాపారం ఎలా చేయాలో చంద్ర‌బాబు తెలిసినంత‌గా ఎవ‌రికి తెలియ‌ద‌ని అన్నారు.
 
ఆయ‌న అక్ర‌మాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే మట్టి తవ్వేందుకు దేవాలయం అడ్డు వస్తుందని అందులో ఉన్న విగ్రహాలను రాత్రికి రాత్రే తరలించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు.. చంద్ర‌బాబు పుణ్య‌మా అంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ పేరును కాస్తా స్కామ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ గా మార్చేశార‌ని మండిప‌డ్డారు..ఈ స్కామ్ లో కింది స్థాయి నుంచి ఏపీ మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు వరకు కమీషన్లు వెళ్తున్నాయనా జ‌గ‌న్ తెలిపారు..అయితే ఇదంతా ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు కు త‌గిన బుద్ది చెప్పాల‌ని జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు సూచించారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.