వైసీపీకి ఛాన్స్ ఎక్కువ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-08 18:09:33

వైసీపీకి ఛాన్స్ ఎక్కువ

చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పాగా వెయ్యాలని చూస్తోంది.. ఇటు వైసీపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్క‌రరెడ్డి,  వైసీపీ త‌ర‌పున గ‌త ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు... అయితే ఇక్క‌డ గ‌ల్లా ఫ్యామిలీ త‌న హవా చాటింది జిల్లా రాజ‌కీయాల్లో.. ఇక కాంగ్రెస్ పార్టీలో ఈ సెగ్మెంట్ ను కంచుకోట‌గా చేసుకుంది.అయితే ఏపీ విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ ప‌రిస్దితి చెప్పుకునే అంత లేక‌పోవ‌డంతో పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు గ‌ల్లా కుటుంబం.
 
పారిశ్రామిక కుటుంబంగా గ‌ల్లా ఫ్యామిలీకి మంచి పేరు ఉంది.. అలాగే జిల్లాలో  ఆర్దికంగా కూడా ఎంతో బ‌ల‌మైన ఫ్యామిలీ.... అందుకే 2014 ఎన్నిక‌ల్లో ఆమెకు చంద్ర‌గికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చిన బాబు, గుంటూరు ఎంపీగా గ‌ల్లా జ‌య‌దేవ్ కు గుంటూరు టికెట్ ఇచ్చారు... గ‌త ఎన్నిక‌ల్లో ఆమె వైసీపీ అభ్య‌ర్ది చెవిరెడ్డి భాస్క‌రరెడ్డి చేతిలో ఓట‌మిపాల‌య్యారు. త‌ర్వాత పార్టీ అధికారంలోకి రావ‌డం ఆమె రాజ‌కీయాల్లో సీనియ‌ర్ గా ఉండ‌టంతో, ఆమెకు చంద్ర‌బాబు ఎమ్మెల్సీ ఇస్తాను అని హామీ ఇచ్చారు... అలాగే ఆమె కూడా ఎమ్మెల్సీ నుంచి మంత్రి ప‌ద‌వి వ‌స్తుంది అని అనుకున్నారు మ‌హిళా కొటాలో.
 
ఇక ఆమెకు మంత్రి ప‌ద‌వి ప‌క్క‌న పెడితే ఎమ్మెల్సీ ప‌ద‌వి కూడా ఇవ్వ‌లేదు.. ఇటు  జిల్లాలో వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించిన అమ‌ర్నాథ్ రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇచ్చారు సీఎం చంద్ర‌బాబు.. అయితే కొంత కాలంగా ఆమె  వైసీపీలో చేర‌తారు అనే వార్త‌లు  వ‌స్తున్నాయి.... చివ‌ర‌కు ఈ వార్త‌లపై  ఆమె క్లారిటీ ఇచ్చారు.. అయితే ఆమె తానేమీ నిర్ణ‌యించుకోలేక‌పోతున్నాను అని అన్నారు. చివ‌ర‌కు ఆమె వ్యాఖ్య‌లు పార్టీలో కొన‌సాగేలా ఉన్నాయా లేదా అనే డైల‌మాని తీసుకువ‌చ్చాయి కేడ‌ర్ లో... ఆమె చంద్ర‌గిరి ని తాను వ‌ద‌ల‌ను అని తెలియ‌చేశారు.
 
అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె కుటుంబానికి చంద్ర‌బాబు సీటు ఇస్తారా ఇక్క‌డ కొత్త వ్య‌క్తిన రంగంలోకి దింపుతారా అని ఆమె కేడ‌ర్ లో ఆలోచ‌న వ‌చ్చింది..ఇటు గుంటూరు నుంచి గల్లా జ‌య‌దేవ్ మ‌రోసారి  ఎంపీగా పోటీకి రెడీ అవుతున్నారు..ఆయ‌నపై లావు ర‌త్త‌య్య‌కుమారుడు కృష్ణ‌దేవ‌రాయ‌లు పోటికి సిద్దంగా ఉన్నారు.
 
ఇద్దరూ ఆర్దికంగా బ‌లంగా ఉన్న‌వ్యక్తులే... అయితే ఇప్పుడు ఈ రాజ‌కీయ క్రీడ‌లో ఎటువంటి మార్పులు గుంటూరులో వ‌స్తాయా అని ఆలోచ‌న చేస్తున్నారు ఇరు పార్టీల శ్రేణులు....ఇక్క‌డ చంద్ర‌గిరిలో రాజ‌కీయంగా కొత్త ముఖాలు వ‌స్తాయా అని ఆలోచ‌న కేడ‌ర్ లో వ‌స్తోంది.
 
ముఖ్యంగా గ‌ల్లా అరుణ కుమారి కుమార్తె ర‌మాదేవి, 2019 ఎన్నిక‌ల‌కు సిద్దం అవుతున్నారు  అని తెలుస్తోంది. ఆమె గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి  నుంచి పోటీ చేయ‌డానికి రెడీ అవుతున్నారని అంటున్నారు గ‌ల్లా అభిమానులు.. ఇటు మంగ‌ళ‌గిర వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కీల‌క నాయ‌కుడిగా ఉన్నారు పార్టీలో... ఆయ‌న‌పై పోటీకి తెలుగుదేశం త‌ర‌పున ఆమె నిల‌బ‌డాలి అని గ‌ల్లా ఫ్యామిలీ ఆలోచ‌న.. అయితే దీనికి సీఎం అంగీకారం తెల‌ప‌లేద‌ని కావాలంటే చంద్ర‌గిరి నుంచి అవ‌కాశం ఇస్తాము అనేలా చెప్పారు అని జోరుగా జిల్లాలో వార్త‌లు వినిపిస్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.