మొద‌లైన చంద్ర‌న్న యాడ్స్ ఇవే హైలెట్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu ads
Updated:  2018-06-29 12:09:24

మొద‌లైన చంద్ర‌న్న యాడ్స్ ఇవే హైలెట్స్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో ఎటువంటి అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేశారో వాట‌న్నింటిని యాడ్స్ రూపంలో త‌యారు చేసి ప‌బ్లిసిటీ చేసేందుకు రెడీ అయ్యారు. 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా చంద్ర‌బాబు తాను అధికారంలోకి వ‌స్తే ముందుగా మ‌ధ్యం షాప్ లు మూసివేత‌, అక్ర‌మ‌వ‌డ్డీ, మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌, రైతు రుణమాఫి, నిరుద్యోగ భృతి వంటి విష‌యాల‌పై మంచి యాడ్ ల‌ను త‌యారు చేయించి ప్ర‌చారం చేయించారు.
 
ఇక ఈ యాడ్స్ చూసిన ప్ర‌తీ ఒక్క‌రిని చంద్ర‌బాబు ఆలోచింప చేసేలా చేశారు. అంతేకాదు రాజ‌కీయంలో అనుభ‌వ‌గ్నుడు కాబ‌ట్టి ఏపీని అభివృద్ది చేయ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తాని భావించి రాష్ట్ర ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకు 2014 ఎన్నిక‌ల్లో అధికార ప‌గ్గాలను అప్ప‌గించారు. ఒక విధంగా చెప్పాలంటే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌చారం కంటే ఆయ‌న అనుకూల మీడియా యాజ‌మాన్యం ఎక్కువ‌గా ఈ యాడ్ ల‌ను టెలికాస్ట్ చేసి ప‌రోక్షంగా ఎన్నిక‌ల ప్ర‌చారం టీడీపీని అధికారంలోకి తీసుకువ‌చ్చింద‌నే చెప్పాలి.
 
ఇక తాజాగా 2019 ఎన్నిక‌ల స‌మ‌రానికి ఇంకా ప‌ది మాసాలు గ‌డువు ఉన్న స‌మ‌యంలో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు త్రీడీ రూపంలో మంచి యాడ్ ను త‌యారు చేయించే క్ర‌మంలో ఉన్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ యాడ్ ముఖ్యంగా ప‌ట్టి సీమ‌, రాయ‌ల‌సీమ‌ను స‌స్య‌శ్యామ‌లం, కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఎదిరించిన ఘ‌న‌త టీడీపీదే అలాగే, ఉక్కు పరిశ్ర‌మ‌కోసం టీడీపీ నాయ‌కులు నిరాహార దీక్ష‌, అమ‌రావ‌తి ఐటీ హ‌బ్, 20 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు, ప్ర‌తీ గ్రామంలో రోడ్ల నిర్మాణం, పోల‌వ‌రంప్రాజెక్ట్, చంద్ర‌న్న‌ పెళ్లి కానుక‌, టెక్నాల‌జి, అవినీతి నిర్మూల‌న‌ వంటి అంశాల‌ను ప్ర‌ధానంగా ప్ర‌స్తావిస్తు చంద్ర‌బాబు నాయుడు యాడ్ ను క్రియేట్ చేయిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
అయితే ఇప్ప‌టికే చంద్ర‌బాబు ఒక చిన్న‌పాటి యాడ్ ను త‌యారు చేయించి త‌న అనుకూల మీడియాలో ప్ర‌చారం చేయిస్తున్నారు. ఇక ఈ చిన్న‌పాటి యాడ్ కోసం ప‌లు మీడియా ఛాన‌ల్లు చంద్ర‌బాబు అపాయింట్‌మెంట్‌ కోసం సీఎం ఆఫీస్ ముందు కాపుకాసుని కుర్చున్నార‌ట‌. ఎందుకంటే ఆ యాడ్ ప్ర‌చురిస్తే చంద్ర‌బాబు నాయుడు త‌మ ఛాన‌ల్ కు ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తార‌ని ఉద్దేశ్యంతో ఎల్లో మీడియా యాజ‌మాన్యం సామాన్య ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను వ‌దిలేసి చంద్ర‌న్న యాడ్స్ కోసం ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.