చంద్ర‌బాబుపై చార్జిషీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-08 16:19:06

చంద్ర‌బాబుపై చార్జిషీట్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు 2014 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి జిల్లాల వారీగా ఆయ‌న‌ ఎలాంటి అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేశారు అనే విషయంపై పీసీసీ చీఫ్ ర‌ఘువీరా రెడ్డి నేడు విలేక‌ర్ల స‌మావేశంలో చార్జిషీట్ విడుద‌ల చేశారు. 
 
ఈ చార్జిషీట్‌ లో 13 అంశాల‌ను చేర్చారు అందులో ప్ర‌ధానంగా...
ప్ర‌త్యేక హోదా ద్రోహం
రుణ‌మాఫి మోసం
డ్వాక్రా రుణ‌మాఫి ద‌గా
జ‌న్మ భూమి క‌మిటీల దోపిడి
యువ‌త‌కు హామీ ఉద్యోగాల వంచ‌నా
ద‌లితుల అణ‌చివేత‌
మ‌హిళ‌ల‌పై దాడులు
కాపురిజ‌ర్వేష‌న్ల‌పై మాయ 
నిరుద్యోగ భృతి మోసం 
 
ఇలా చంద్ర‌బాబు నాయుడు 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌క‌టించిన హామీల గురించి 13 అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ చార్జిషీట్ ను విడుద‌ల‌ను చేసింది. అయితే తాము విడుద‌ల చేసిన‌ చార్జిషీట్ పై చంద్ర‌బాబు ఎక్క‌డైనా చ‌ర్చ‌ పెడితే తాము ఆ చ‌ర్చ‌కు కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు సిద్ద‌మ‌ని స‌వాల్ విసిరింది.
 
ఈ రోజు ప్ర‌జావంచ‌న పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న కార్యక్ర‌మం చేప‌డుతున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్ప‌డి నాలుగు సంవ‌త్స‌రాలు అయిన సంద‌ర్భంగా చార్జిషీట్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ర‌ఘువీరా రెడ్డి మాట్లాడుతూ... ఎన్న‌డూ చూడ‌ని విధంగా టీడీపీ స‌ర్కార్ అవినీతికి పాల్ప‌డుతుంద‌ని ఆరోపించారు. అమ‌రావ‌తి నిర్మాణం పేరు చెప్పి ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి అక్ర‌మంగా భూముల‌ను లాక్కున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.