కేఈ కోట‌లో శ్రీదేవి హ‌వా స‌ర్దేసిన త‌మ్ముళ్లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-23 12:42:33

కేఈ కోట‌లో శ్రీదేవి హ‌వా స‌ర్దేసిన త‌మ్ముళ్లు

మాజీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క రామారావు పార్టీ స్థాపించిన త‌ర్వాత ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో 1983లో ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున తిమ్మారెడ్డి పోటీ చేసి త‌న ప్ర‌త్య‌ర్థి గుప్తాపై ఘోర ప‌రాజం ఎదుర్కొన్నారు.
 
ఆ త‌ర్వాత 1985లో ఎన్నిక‌లు జ‌రిగితే ఇ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన మ‌హాబ‌లేశ్వ‌ర గుప్త త‌న ప్ర‌త్య‌ర్థి రామ‌కృష్ణా రెడ్డిపై అత్య‌ధిక మెజారిటీతో గెలిచారు. అయితే తెలుగుదేశం పార్టీకి కూడా ఈ నియోజ‌కవ‌ర్గం నుంచి మొద‌టి విజ‌యం ఆ త‌ర్వాత 1986లో ప‌త్తికొండ‌ నియోజ‌కవ‌ర్గంలో ఉపఎన్నిక‌లు జ‌రిగాయి. అయితే ఆ ఎన్నిక‌ల్లో కూడా సుబ్బ‌రత్నం టీడీపీ త‌ర‌పున పోటీ చేసి త‌న ప్రత్య‌ర్థిపై అత్య‌ధిక మెజారిటీతో గెలిచారు. 
 
మ‌ళ్లీ 1989లో ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన హుచ్చ‌ప్ప త‌న ప్ర‌త్య‌ర్థి ప‌టేలు శేషిరెడ్డిపై ఘోర ప‌రాయ‌జయం ఎదుర్కొన్నారు. ఇక ఇదే టీడీపీకి చివ‌రి ప‌రాజ‌యం అని చెప్పాలి. ఎందుకంటే 1994 నుంచి 2014 వ‌ర‌కూ టీడీపీ విజ‌యం సాధిస్తూనే ఉంది. అయితే ముఖ్యంగా ఈ నియోజ‌క‌ర్గం నుంచి ఎస్వీ సుబ్బారెడ్డి టీడీపీ త‌ర‌పున పోటీ చేసి హ్యాట్రిక్ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు. ఆ త‌ర్వాత 2009లో కేఈ ప్ర‌భాక‌ర్ టీడీపీ త‌ర‌పున పోటీ చేసి ఎస్వీ మెహ‌న్ రెడ్డిపై విజ‌యం సాధించారు. 
 
ఇక తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న త‌ర్వాత ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో కేఈ ప్ర‌భాక‌ర్ సోద‌రుడు కేఈ కృష్ణమూర్తి పోటీ చేసి మ‌రోసారి ఈ నియోజ‌కవ‌ర్గంలో టీడీపీ జెండాను ఎగుర‌వేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ నుంచి నేటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌ర‌కూ ప‌త్తికొండ నియోజ‌కవ‌ర్గం టీడీపీకి కంచుకోట‌గా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తోంది. 
 
టీడీపీకి ఇంత‌టి ఘ‌న‌మైన చ‌రిత్ర ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2019 సార్వ‌త్రికి ఎన్నికల్లో టీడీపీకి బీట‌లు వాలే ఆస్కారం ఎక్కువగా ఉంద‌ని వార్త‌లు వస్తున్నాయి. 2014 ఎన్నిక‌ల్లో కేఈ కృష్ణమూర్తి తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత హంద్రీనివా కాలువ నుంచి రైతుల‌కు సాగు నీరు వ‌చ్చేలా చేస్తాన‌ని, అలాగే ఈ నియోజ‌కవ‌ర్గంలో రైతులు ఎక్కువ‌గా ట‌మోటా పండిస్తారు కాబ‌ట్టి ఈ నియోజ‌కవ‌ర్గంలో ట‌మోటా జ్యూస్ ఫ్యాక్ట‌రీని నిర్మిస్తామ‌ని కేఈ హామీ ఇచ్చారు. అయితే టీడీపీ అధికారంలోకి వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్నాకూడా ఇంత‌వ‌ర‌కు జ్యూస్ ఫ్యాక్ట‌రీని నిర్మించ‌లేదు.
 
దీంతో కేఈ కుటుంబంపై రైతులు గుర్రుగా ఉన్నారు. అంతే కాదు మొన్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు ఈ నియోజ‌కవ‌ర్గంలో మినీ మ‌హానాడు స‌భ‌ను ఏర్పాటు చేశారు. ఈ స‌భ‌కు జిల్లాకు చెందిన టీడీపీ నాయ‌కులంద‌రూ హాజ‌ర‌య్యారు. వారితోపాటు శాలివాహ‌న అధ్యోలులు తుగ్గ‌లి నాగేంద్ర కూడా హాజ‌ర‌య్యారు. అయితే ఈ స‌భ‌లో నాగేంద్ర‌ను ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్ర‌భాక‌ర్ ఇష్టానుసారంగా మాట్లాడ‌టంతో వారిద్ద‌రు స‌భా ముఖంగా నువ్వేంతంటే నువ్వేంత అని కుస్తీ ప‌డ్డారు. 
 
ఈ క్ర‌మంలో నాగేంద్ర రెచ్చిపోయి త‌న‌తో పెట్టుకుంటే భూ స్థాపితం చేస్తాన‌ని స‌భాముఖంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వాస్త‌వానికి తుగ్గలి నాగేంద్ర‌ వల్లే ప‌త్తికొండ‌లో టీడీపీ విజ‌యానికి బ‌లం చేకూరుతుంది. ఆయ‌న అండ‌తోనే టీడీపీ ప్ర‌తీ ఏటా నెగ్గుకొస్తోంది. అంత‌టి ప్ర‌జాధ‌ర‌ణ ఉన్న వ్య‌క్తిని కేఈ కుటుంబం దూరం చేసుకుంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున ఎవ్వ‌రు పోటీ చేసినా గెల‌వ‌డం క‌ష్టంగా మారుతోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. 
 
అయితే ముఖ్యంగా గ‌డిచిన‌ ఎన్నిక‌ల్లో ఏపీలో కాంగ్రెస్ దారుణంగా ప‌రాజ‌యం పాలైంది. సీమ‌లోనే కాదు కోస్తాలో కూడా  ఎవ‌రికి రాన‌టువంటి ఓట్లు ప‌త్తికొండ‌లో కాంగ్రెస్ త‌ర‌పున నిల‌బ‌డిని చెరుకులపాడు నారాయ‌ణ రెడ్డికి వ‌చ్చాయి. ఆయ‌న త‌ర్వాత వైసీపీలో చేర‌డం ఇక్క‌డ బాధ్య‌త‌లు తీసుకుని పార్టీని గాడిలో పెట్ట‌డం జ‌రిగింది. అయితే ప్ర‌త్య‌ర్దులు ఆయ‌న్ని అత్యంత పాశ‌వికంగా చంపారు. 
 
అయితే కే.ఈ కుమారుడు శ్యాంబాబు ఈ కేసులో నిందితుడు అని వారి ఆగ‌డాల‌ను అడ్డుకున్నందుకే త‌న భ‌ర్త‌ను చంపించారు అని ఆయ‌న భార్య, ప్ర‌స్తుత వైసీపీ ఇంచార్జ్ చెరుకుల పాడు శ్రీదేవి కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్క‌డ చెరుకులపాడు ఫ్యామిలీకి జ‌రిగిన విషాదం రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఇక్క‌డ కూడా శ్రీదేవికి ఎక్కువ‌గా ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు వ‌స్తోంది. ఇక ప‌త్తికొండ టీడీపీ నుంచి వైసీపీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార మార్పు ఇవ్వ‌డం ఖాయం అంటున్నారు స‌ర్వే ద్వారా విశ్లేష‌కులు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.