సీమ‌లో సైకిల్ కు పంక్చ‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

cherukulapdu sridevi ycp
Updated:  2018-03-25 12:12:41

సీమ‌లో సైకిల్ కు పంక్చ‌ర్

ప్ర‌తిప‌క్ష నేత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌కు అడుగ‌డుగునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.... ప్ర‌స్తుతం ఈ సంక‌ల్పయాత్ర తెలుగుదేశం పార్టీ కంచుకోట అయిన గుంటూరు జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది... ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ఓపిక‌గా తెలుసుకుంటూ..? అలాగే అధికార టీడీపీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
అదే స్పూర్తితో త‌మ అధినేత బాట‌లోనే న‌డుస్తూ ఇంటింటికి జ‌గ‌న్ యాత్ర పేరుతో మ‌రో వైసీపీ నాయ‌కురాలు యాత్ర చేస్తున్నారు..ప్ర‌తీ ఇంటికి వెళ్లి ప్లీన‌రీలో ప్ర‌క‌టించిన అంశాల‌ను వివ‌రిస్తూ ఈ యాత్ర‌లో ముందుకు సాగుతున్నారు ప‌త్తికొండ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ చెరుకుల‌పాడు శ్రీదేవి... ఈ యాత్ర‌లో ఎవ‌రు ఊహించ‌ని ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
 
ప్ర‌తీ ఊరులో శ్రీదేవికి వైయ‌స్సార్ కార్య‌క‌ర్త‌లే కాకుండా టీడీపీ కార్య‌క‌ర్త‌లు కూడా క‌లుపుగోలుగా వ‌చ్చి వైసీపీకి మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. అయితే పార్టీలోకి వచ్చే  ప్ర‌తీ ఒక్క‌రిని శ్రీదేవి ఆప్యాయంగా ప‌లుక‌రించి వారికి పార్టీ కండువ క‌ప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.
 
ఈ సంద‌ర్భంగా వైసీపీలోకి చేరిన‌ కార్య‌క‌ర్త‌లు మాట్లాడుతూ... తాము ఇన్నాళ్లు టీడీపీ అధికారంలోకి వ‌స్తే త‌మ‌కు మంచి జ‌రుగుతుంద‌ని భావించి సైకిల్ పార్టీకి ఓట్లు వేశామ‌ని, కానీ ఐదు మండ‌లాల్లో ఒక్క‌చోట కూడా, ఈ నాలుగేళ్ల తెలుగుదేశ పాల‌న‌లో అభివృద్ది జ‌రుగ‌లేద‌ని ప్ర‌జ‌లు కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. 
 
అలాగే రెండు ద‌శాబ్దాలుగా తెలుగు దేశం పార్టీకి కంచుకోట‌గా ఉన్న ఈ సెగ్మెంట్ లో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కంచుకోటను బ‌ద్ద‌లు గొడ‌తామ‌ని  వైసీపీ కార్య‌క‌ర్త‌లు త‌మ ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు...అందులో భాగంగానే  తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా, ఉప ముఖ్యమంత్రి కేఈ. కృష్ణ‌మూర్తి త‌న నియోజ‌క వ‌ర్గంలో ఎటువంటి  అభివృద్ది కార్య‌క్ర‌మం కూడా చేయ‌లేద‌ని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.
 
ఎన్నిక‌ల ప్ర‌చారంలో కేఈ. కృష్ణ‌మూర్తి త‌మ ప్రాంతాల‌కు అనేక హామీల‌ను ప్ర‌క‌టించార‌ని, కానీ ఒక్క‌టి కూడా అమ‌లు చేయ‌లేద‌ని అంటున్నారు రైతులు.. అలాగే  ఇక్క‌డ నివ‌సించే రైతులు అత్య‌ధికంగా ట‌మోటా సాగు చేస్తారు.. వారికి గిట్టుబాటు ధ‌ర వచ్చేలా టమోటా ఉత్ప‌త్తికి సంబంధించి ఒక ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తాన‌ని గ‌తంలో ప్ర‌క‌టించారు... కానీ ఇంత‌వ‌ర‌కూ దాని ప్ర‌స్తావ‌న లేద‌ని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. మొత్తానికి  పార్టీలో పెద్ద నాయ‌కుడు ఉప‌ముఖ్య‌మంత్రి సెగ్మెంట్ లోనే ఇటువంటి ప‌రిస్దితి ఉంటే... సీమలో స్వింగ్ అంటూ చ‌క్రం తిప్పుతాము అంటున్న తెలుగుదేశం రాజ‌కీయం ఎటువంటి మ‌లుపులు సీమ‌లో జ‌రుగుతాయో అని అంటున్నారు విశ్లేష‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.