మీ గొప్ప మ‌న‌సుకు స‌లాం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-09 10:35:26

మీ గొప్ప మ‌న‌సుకు స‌లాం

మానవ సంబంధాల‌న్నీ ఆర్ధిక సంబంధాలుగా  మారిన ఈ రోజుల్లో రాజ‌కీయాల‌కు అతీతంగా  ముందుకు సాగుతున్న వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవి రెడ్డి భాస్క‌ర్ రెడ్డిని అభినందించాల్సిందే... ఆయ‌న గొప్ప మ‌న‌సుకు స‌లాం చేయాల్సిందే. 
 
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత గాలి ముద్దు కృష్ణ‌మ నాయుడు ఇటీవ‌ల అనారోగ్యంతో మ‌రణించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.  రాజ‌కీయాల‌ను  ప‌క్క‌కు పెట్టి ప్ర‌త్య‌ర్ధి పార్టీ నేత అయినా కూడా గాలి అంత్య‌క్రియ‌ల‌కు హ‌జ‌ర‌య్యారు వైసీసీ నేత‌లు చెవి రెడ్డి భాస్క‌ర్ రెడ్డి, భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి.
galimudhhukrishnama naiduycpmlas
 
హ‌జ‌రుకావ‌డ‌మే కాకుండా  అంత్య‌క్రియ‌ల‌కు వెళ్తున్న  గాలి పార్దీవ దేహాన్ని భుజాన మోశారు. ఈ సంఘ‌ట‌న‌తో మాన‌వ‌త్వంలో వారికి వారే సాటి అని నిరూపించుకున్నారు. దీంతో పాటు జిల్లా ఎడిస‌న్ లో ఫుల్ పేజ్‌ యాడ్ తో ముద్దన్నా నీవు మళ్లీ మా గడ్డపైనే జన్మించవా అంటూ గాలికి నివాళులు అర్పించారు. మ‌రోవైపు వైసీసీ ఎమ్మెల్యే రోజా కూడా గాలిముద్దుకృష్ణ‌మ నాయుడుకి రాజ‌కీయాల‌కు అతీతంగా నివాళులు అర్పించిన విష‌యం తెలిసిందే.

షేర్ :

Comments

1 Comment

  1. We appreciate your humane concerns

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.