అది బాబు రాజ‌కీయం చిన‌రాజ‌ప్ప చ‌ప్ప‌ట్లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-09 14:48:09

అది బాబు రాజ‌కీయం చిన‌రాజ‌ప్ప చ‌ప్ప‌ట్లు

వ‌జ్రాన్ని వ‌జ్రంతో కోయాలి అనేది తెలిసిందే..  ఇక రాజ‌కీయాల్లో కూడా పార్టీ త‌ర‌పున ఇంట‌ర్న‌ల్ గా నాయ‌కుల‌తో  ఎన్ని వివాదాలు ఉన్నా, కండువా మ‌డ‌త కూడా ప‌డ‌కుండా నాయ‌కుల‌తో రాజ‌కీయాలు నెర‌పాలి.. అది ఇప్పుడు చేయ‌డంలో టీడీపీ ముందు ఉంటుంది.. ఊహించిన వారికి టిక్కెట్లు ఇవ్వ‌డం..? మీడియా కూడా అస‌లు ప్ర‌క‌టించని అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించిండం,  ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డాలి, త‌ర్వాత ఆర్దికంగా పార్టీకి ఉప‌యోగ‌ప‌డాలి అనుకునే నాయ‌కుల‌కు మాత్ర‌మే బాబు సీట్లు టిక్కెట్లు ప‌ద‌వులు ఇస్తారు... కాదు అని అన‌డానికి లేదు...ఇటురాజ్య‌స‌భ అటు పార్ల‌మెంట్ ఎంపీలు ఎవ‌రు ఉన్నారు అంటే ట‌క్కున పారిశ్రామిక వేత్త‌ల పేర్లు చెబుతాం.
 
ఇక పార్టీలు ప‌క్క‌న పెట్టి ఈ కులం వాడు మ‌న పార్టీ వారిని తిడితే,  మ‌న పార్టీలో ఆ కులం వాడిచేత వాడిని తిట్టాలి అనే రాజ‌కీయం ఉంది..అయితే కుల రాజ‌కీయాల‌కు టీడీపీ వైసీపీ బీజేపీ ఇంకా ఎదుగుతున్న‌ జ‌న‌సేన అన్నీ అతీత‌మే.. అయితే స‌మ‌యానుకులంగా ఎవ‌రు ఏఏ పావులు క‌దుపుతారు అనేది ఇక్క‌డ పెద్ద చ‌ర్చ‌జ‌రిగే అంశం.
 
ముఖ్యంగా బీజేపీకి మైనార్టీల‌ను త‌గిలించ‌డం, కాపుల‌కు బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ల  వివాదం ఇటీవ‌ల మ‌రింత పెరిగింది.. అక్క‌డ మోడీ చ‌రిష్మా ఇక్క‌డ జ‌గ‌న్ తో పొస‌గ‌ని వైనం ఈ రెండు అవ‌కాశ వాదాలుగా వాడుకోవాలి అని సైకిల్ ఆలోచ‌న‌.. ఇక తూర్పుగోదావ‌రి జిల్లా టీడీపీలో కాపుల‌కు పెద్ద‌గా ఉండే టీడీపీ నాయ‌కులు మంత్రి చిన‌రాజ‌ప్ప అయితే, ఇటు బీసీల‌కు పెద్ద దిక్కుగా ఉండే సీనియ‌ర్ నేత మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు.. అవ‌స‌రం వ‌స్తే ఇద్ద‌రూ జ‌గ‌న్ పై విమర్శలు వ‌దులుతారు..
 
ఇటు జ్యోతుల నెహ్రూ కూడా సీనియ‌ర్ గా వీరికి జోడు అవుతారు అనుకుంటే అస‌లు ఆయ‌న క‌నిపిస్తున్న దాఖ‌లాలు లేవు. పార్టీ ఫిరాయించిన త‌ర్వాత  ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి కాదుక‌దా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు విష‌యంలో కూడా క్లారిటీ లేకుండా చేసేశారు... చంటిబాబు టీడీపీ నుంచి జంప్ అవ‌డంతో డోకా లేదు అనుకున్నా, మంత్రి య‌న‌మ‌ల‌ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల్లో చిక్కుకోకుండా ఉండాలి అని జ్యోతుల‌ ఆలోచ‌న‌..
 
ఇక చిరంజీవిని ఎదుర్కొన్నాం ఈ జ‌న‌సేన ఎంత అనే మాట అన్నారు డిప్యూటీ సీఎం చిన‌రాజ‌ప్ప.. గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ప‌క్క‌న ఉంటే చాలు ఓట్లు ప‌డ‌తాయి అనుకున్న తెలుగుదేశం నాయ‌కులు ఇప్పుడు ప‌వ‌న్ ని క‌రివేపాకులా తీసేశారు.. ఇటు ప్ర‌జారాజ్యం పార్టీ ఇంకా పోటీ చేసి మంచి పోటీ ఇచ్చింది ఇటు కాంగ్రెస్ టీడీపీకి ఇప్పుడు జ‌న‌సేన వ‌చ్చిన సంవ‌త్స‌రం బాబుకు సాగిల‌ప‌డి త‌ప్పు చేసింది అనేది ప‌వ‌న్ జీర్ణించుకోలేని అంశం.
 
అఫ్ కోర్స్ చిరంజీవికి రాజ‌కీయంగా కాపులు బ‌లంగా ఉన్న సెగ్మెంట్లు తూగో ప‌గో ఇవి కూడా మైన‌స్ అయ్యియి ప్రజారాజ్యం పార్టీ  పోటీ చేసిన స‌మ‌యంలో , ఇటు కాంగ్రెస్ కాపు నాయ‌కులు కాకుండా టీడీపీ కాపు నాయ‌కులే ఎక్కువ‌గా ప్ర‌జారాజ్యం వైపు వెళ్లారు జిల్లాలో.. అంద‌రూ వెళ్లిపోయినా చిన‌రాజ‌ప్ప అలాగే టీడీపీని ప‌ట్టుకుని ఉన్నారు.. అందుకే రాజ‌ప్ప నీకు మంత్రి ప‌ద‌వి అన్నారు టీడీపీ గెలిచిన త‌ర్వాత చంద్ర‌బాబు.. మొత్తానికి బాబురాజ‌కీయాలు అంత ఈజీగా అర్ధం కావు ? రెడ్డికి రెడ్డి, కాపులు కాపు, బ‌లిజ‌కు బ‌లిజ‌-- బీసీకి బీసీ-- ఎవ‌రు ఏమి అన్నా టీడీపీ త‌ర‌పున ఆయా వ‌ర్గాలు మాట‌ల తూటాలు వ‌దులుతాయి అన‌డంతో మ‌రోసారి నిరూపింతం అయింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.