లోకేశ్ పోటీపై హోం మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-09 18:21:27

లోకేశ్ పోటీపై హోం మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ అధికార‌ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కుమారుడు మంత్రి నారాలోకేశ్ పై జ‌నసేన పార్టీ అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. లోకేశ్ కేవ‌లం అధికార బ‌లంతో అడ్డ‌దారిన మంత్రి అయ్యార‌ని, ఆయ‌నకు ద‌మ్ముంటే త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి టీడీపీ త‌ర‌పున పోటీ చేసి గెలవాల‌ని ప‌వ‌న్ స‌వాల్ విసిరారు. లోకేశ్ ఎక్కడ అయితే పోటీ చేస్తారో ఆయ‌న‌కు పోటీగా తాను జ‌న‌సేన పార్టీ త‌ర‌పున‌ త‌న‌ కార్య‌క‌ర్త‌ను పోటీ చేయించి గెలుస్తాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే.
 
అయితే తాజాగా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై రాష్ట్ర హోమంత్రి చిన‌రాజ‌ప్ప స్పందించారు తూర్పు గోదావ‌రి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో మంత్రి నారాలోకేశ్ ఖ‌చ్చితంగా  ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌ని స్ప‌ష్టం చేశారు. లోకేశ్ ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తానంటే ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తాము పోటీ చేయిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. 
 
ప‌వ‌న్ కళ్యాణ్ మాదిరిగా పార్ట్ టైమ్ రాకీయాలు టీడీపీ నాయ‌కులు చేయ‌ర‌ని చినరాజ‌ప్ప స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో లోకేశ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఖ‌చ్చితంగా గెలుస్తార‌ని చిన‌రాజ‌ప్ప ధీమాను వ్య‌క్తం చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కేంద్రానికి అమ్ముడు పోయి టీడీపీ నాయ‌కులపై లేనిపోని నింద‌లు వేస్తున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. ప‌వ‌న్ కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు త‌గిన బుద్ది చెబుతార‌ని తాము ఎవ‌రితో పొత్తు పెట్టుకోకుండా బ‌రిలోకి దిగుతామ‌ని చినరాజ‌ప్ప స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.