చంద్ర‌బాబుపై 24 కేసులు చిన‌రాజ‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-09-10 17:10:19

చంద్ర‌బాబుపై 24 కేసులు చిన‌రాజ‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణలో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌న్న నేప‌థ్యంలో టీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తులు విష‌యం ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారుతుంది. అయితే ఇదే విష‌యంలో ఏపీ హోం మంత్రి నిమ్మ‌కాయ‌ల‌ చినరాజ‌ప్ప సంచ‌లన‌ వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తులపై తుది నిర్ణయం కాంగ్రెస్ పార్టీ నాయ‌కులే తీసుకుంటార‌ని స్ప‌ష్టం చేశారు. 
 
అంతేకాదు ఇదే విష‌యాన్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా తెలంగాణ‌ టీడీపీ నాయ‌కుల‌కు అప్ప‌గించార‌ని స్ప‌ష్టం చేశాయి. అయితే 2019  ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ టీడీపీ పొత్తు ఎట్టి ప‌రిస్థితిలో ఉండ‌దని అన్నారు. అలాగే అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. కొద్దిరోజుల క్రితం జేసీ ఏపీలో పోలీసులు స‌రిగా ప‌నిచేయ‌కున్నార‌ని అన్నార‌ని, అయితే ఆయ‌న అలా మాట్లాడ‌టం స‌రికాద‌ని రాజ‌ప్ప ఆరోపించారు.
 
టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఫ్రేన్లీపోలీసింగ్ ప్రోత్స‌హిస్తున్నామ‌ని పేర్కొన్నారు. జేసీ టీడీపీలో ఉన్నా కూడా ఆయ‌న‌కు కాంగ్రెస్ వాస‌న పోలిక‌లు ఇంకాపోలేద‌ని ఎద్దేవా చేశారు. అలాగే చంద్ర‌బాబు నాయుడు పై 24 కేసులు పెండింగ్  ఉన్నాయ‌ని, కోర్టులు స్టే విధించాయ‌ని చిన‌రాజ‌ప్ప అన్నారు. నిన్న ఎమ్మెల్యే ప‌ల్లే ర‌ఘునాథ్ రెడ్డి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చి ఆయ‌న  ఈ వ్యాఖ్య‌లు చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.