జేసీ దివాక‌ర్ రెడ్డికి చిన‌రాజ‌ప్ప వార్నింగ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jc divakar reddy and chinarajappa
Updated:  2018-09-22 17:53:57

జేసీ దివాక‌ర్ రెడ్డికి చిన‌రాజ‌ప్ప వార్నింగ్

అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర్గ‌పోరు త‌గ్గ‌డంలేదు. న‌గ‌రంలో 144 సెక్ష‌న్లు అమ‌లు చేసినా కూడా ప‌రిస్ధితి స‌ర్ధుమనిగేలా క‌న‌ప‌డ‌టంలేదు. అయితే ఈ క్ర‌మంలో జేసీ దివాక‌ర్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి వారు కొజ్జాల‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లను సీరియ‌స్ గా తీసుకున్న పోలీస్ అధికారి మీసం తిప్పుతూ తాము మ‌గాళ్లం అని, జేసీ నోరు అదుపులు పెట్టుకుని మాట్ల‌డ‌క‌పోతే నాలుక కోస్తామ‌ని పోలీస్ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. 
 
ఇక ఇదే స్థాయిలో తిరిగి జేసీ నీ అబ్బారే మాధవ్ నాలుక కోస్తావా రాఎక్క‌డికి రావాలో చెప్పు అంటూ నిన్న జేసీ మీడియా ముందు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక వీరిద్ద‌రు చేసుకున్న విమ‌ర్శ‌ల‌పై హోంశాఖ‌ మంత్రి చిన‌రాజ‌ప్ప స్పందించారు. 
 
జేసీ చేసిన వ్యాఖ్య‌లు అయ‌న విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నామ‌ని అన్నారు. తాజాగా ఈ రోజు పిఠాపురంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ అధికార పార్టీలో జేసీ ఉండి కూడా ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌పై ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌టం స‌రికాద‌ని ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు పోలీస్ అధికారులు కూడా నాలుక కోస్తామ‌ని అన‌డంపై కూడా రాజ‌ప్ప దుయ్యబ‌ట్టారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పోలీస్ వ్య‌వ‌స్థ స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తుంద‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.