టీడీపీలో చిచ్చు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-09 19:06:24

టీడీపీలో చిచ్చు

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని రాజ‌కీయాలు నిప్పు - ఉప్పులా మారుతున్న‌ సంగ‌తి తెలిసిందే. మీడియా స‌మ‌క్షంలో ఒకరిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటూ తామంటే తాము గ్రేట్ అంటూ విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు రాజ‌కీయ నాయ‌కులు. ఇక‌ ఈ క్ర‌మంలో ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ముందంజ‌లో ఉన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతిని తాము సాక్షాల‌తో స‌హా బ‌య‌ట పెడ‌తామంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు వైసీపీ నాయ‌కులు. దీంతో టీడీపీ నాయ‌క‌లు బెంబేలెత్తిపోతున్నారు. 
 
వైసీపీ నాయ‌కుల వ‌ద్ద బ‌ల‌మైన ఆధారాలు ఉన్నాయి కాబ‌ట్టే సాక్షాల‌తో సహా మీడియా ముందు హాజ‌రు ప‌రుస్తామ‌ని అన‌డంతో ప్ర‌స్తుతం సైకిల్ పార్టీ నాయ‌కులలో భ‌యం మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. దీంతో లోప‌లికి భ‌య‌ప‌డుతున్నా కానీ, మీడియా ముందు అస‌లు రంగు క‌నిపించ‌కుండా క‌వ‌ర్ చేసుకుంటూ వ‌స్తున్నారు టీడీపీ నాయ‌క‌లు.
 
ఇక తాజాగా ఏపీ మంత్రి చిన‌రాజ‌ప్ప ఓ ప్ర‌ముఖ  ఛాన‌ల్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు... ఈ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ... త‌న‌కు ఇద్ద‌రు శ‌త్రువులు ఉన్నార‌ని, ఈ ఇద్ద‌రిలో ఒక‌డు పోయాడ‌ని, ఇంకొక‌డు ఉన్నాడ‌ని చెప్పారు. ఆ ఇద్ద‌రు ఎవ‌ర‌ని మీడియా అడుగ‌గా.. ఒక‌డు బొడ్డు భాస్కర రామారావు అని రెండో వ్యక్తి మెట్ల సత్యనారాయణరావు అనిచెప్పారు రాజ‌ప్ప‌.
 
ఇక ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. మంత్రి ప‌ద‌విలో ఉండి ఇత‌రుల‌ను ఎలా గౌర‌వించాలో తెలియకుండా మాట్లాడుతున్నార‌ని  ఆరోపిస్తున్నారు ప్ర‌జ‌లు. ప్ర‌తీ ఒక్క‌రు పెద్ద మనిషిగా గౌరవించే డాక్టర్‌ మెట్ల సత్యనారాయణరావును మంత్రి రాజ‌ప్ప‌ ఒకడు వెళ్లిపోయాడని మ‌ర్యాద లేకుండా మాట్లాడడంతో అమలాపురంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా రాజ‌ప్ప‌పై మండిప‌డుతున్నారు.
 
అయితే ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వెంట‌నే వెన‌క్కి తీసుకుకోవాల‌ని లేక‌పోతే అమలాపురంలో చిన‌రాజ‌ప్ప‌ను తిరుగ‌నివ్వ‌కుండా చేస్తామ‌ని  అంటున్నారు. ఇక మ‌రోవైపు టీడీపీ నాయకులైన మున్సిపల్‌ చైర్మన్‌ చిక్కాల గణేష్,  పట్టణ టీడీపీ అధ్యక్షుడు తిక్కిరెడ్డి క‌లిసి ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు.
 
మొత్తానికి రాజ‌ప్ప‌చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపుతున్నాయ‌నే చెప్పాలి. ఇక ఈ విష‌యంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.