జ‌గ‌న్ చెబితే ఆప‌ని చేస్తాం ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chintala ramachandra reddy
Updated:  2018-04-10 04:54:56

జ‌గ‌న్ చెబితే ఆప‌ని చేస్తాం ?

ప్ర‌త్యేక హూదా పోరు ఏపీలో పతాక స్దాయికి చేరుకుంది అనే చెప్పాలి.. ఇక ఎంపీలు త‌మ ఆరోగ్యాన్ని కూడా లెక్క‌చేయ‌కుండా ముందుకు వెళుతున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి మిథున్ రెడ్డి ప్ర‌త్యేకహూదా కోసం నిరాహార దీక్ష కొన‌సాగిస్తున్నారు. ఇటు ప్ర‌త్యేక హూదా సాధ‌న కోసం ఎంపీలు పోరాటం చేయ‌డం పై ఏపీలో ప్ర‌జ‌లు అంద‌రూ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.
 
ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాలిస్తే ఎమ్మెల్యేలమంతా రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి అన్నారు... వైసీపీ ఎంపీలు ఏపీ బాగుకోసం ఓ మంచి నిర్ణ‌యం తీసుకున్నార‌ని చ‌రిత్ర‌లో నిలిచిపోయే నిర్ణ‌యం అని ఆయ‌న కొనియాడారు.. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా చంద్రబాబు శాసనసభ్యుల వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
 
చంద్ర‌బాబు స‌ర్కారు పై ప్ర‌జ‌లు తీవ్రంగా వ్య‌తిరేక‌త చూపుతున్నారు అని అన్నారు..నాలుగేళ్లుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా నియంతలా పరిపాలన చేస్తున్నాడని చంద్ర‌బాబు వైఖ‌రిపై ఆయ‌న మండిప‌డ్డారు..ఇలాంటి ప‌రిపాల‌న గ‌త సీఎంలు ఎవ‌రూ చేయ‌లేదు అని విమ‌ర్శించారు.
 
త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో పెన్షన్‌ ఇచ్చేందుకు, రోడ్లు వేయించేందుకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదన్నారు. ఎమ్మెల్యేలు, అధికారుల వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి పెత్తనం మొత్తం వారికి అంటగాట్టారన్నారు. టీడీపీ కార్యకర్తలకు ప్రభుత్వంలో పెద్దపీట వేసి వ్యవస్థలను చంద్రబాబు దుర్వినియోగం చేశాడని విమ‌ర్శించారు. ఇంత నీచంగా పరిపాలన చేసే ముఖ్యమంత్రిని మొదటి సారి చూస్తానన్నారు. టీడీపీ ఎంపీలు ఈ పోరాటంలో ముందుకు రావాల‌ని, అంద‌రూ రాజీనామాలు చేస్తే కేంద్రం దిగి వ‌స్తుంది అని అన్నారాయ‌న‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.