చింత‌మ‌నేని ఖాతాలో మ‌రో అవినీతి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chintamaneni
Updated:  2018-09-06 15:57:49

చింత‌మ‌నేని ఖాతాలో మ‌రో అవినీతి

అధికార తెలుగుదేశం పార్టీ దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఆగ‌డాల‌కు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. అధికార బ‌లంతో ప్ర‌భాక‌ర్ అక్ర‌మ మైనింగ్ త‌వ్వాకాలు చేస్తున్నా కూడా ప్ర‌భుత్వ అధికారులు చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.అయితే తాజాగా ఆయ‌న చేయిస్తున్న అక్ర‌మాల‌పై ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స‌మ‌న్వ‌య క‌ర్త అబ్బ‌య్య చౌద‌రి అడ్డుకున్నారు. 
 
చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఎలాంటి అనుమ‌తులు లేకుండా గ్రావెల్ ను త‌ర‌లిస్తూ కోట్ల రూపాయ‌ల‌ను సంపాదించుకుంటున్నార‌ని  అబ్బ‌య్య మండిప‌డ్డారు.అంతేకాదు ఈ అక్ర‌మ మైనింగ్ త‌వ్వ‌కాల‌పై విజిలెన్స్ క‌మిటీ వేసీ విచార‌ణ చేప‌డితే ఎమ్మెల్యే చింతమ‌నేని ప్ర‌భాక‌ర్ ఎంత మొత్తంలో అవినీతికి పాల్ప‌డ్డారో తెలుస్తుంద‌ని అయ‌న డిమాండ్ చేశారు. 
 
అలాగే పెద‌వేగి మండ‌లం గార్ల‌మ‌డుగు పంచాయితీ సూర్యా పేట‌కు చెందిన వైసీపీ కార్య‌క‌ర్త‌ల ఇళ్లను అధికార బ‌లంతో చింతమ‌నేని అధికారుత‌లో తొలగించాల‌ని చూస్తే అబ్బ‌య్య చౌద‌రి అడ్డుకున్నారు. గ‌తంలో ఈ ఇళ్ల‌ను తొలించాలంటే బాధిత కుటుంబాల‌కు 25 ల‌క్ష‌ల రూపాల‌ను న‌ష్టప‌రిహారాన్ని ప్ర‌భుత్వం చెల్లించి ఇళ్ల‌ను తొల‌గించాల‌ని ద‌ర్మాస‌నం కోరింది. 
 
కానీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని హైకోర్ట్ ఆదేశాల‌ను దిక్క‌రించి ప్ర‌భుత్వ ధికారుల‌తో ఆయ‌న తొంగిచాల‌ని చూశారు. ఇక ఈ విష‌యాన్ని తెలుసుకున్న అబ్బ‌య్య టీడీపీ నాయ‌కులు చేసే అరాచ‌కాల‌ను అడ్డుక‌ట్ట వేసీ అక్ర‌మంగా తొల‌గిస్తున్న ఇళ్ల‌ను ఆపించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.