వివాదంలో చింత‌మ‌నేని

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-18 13:22:52

వివాదంలో చింత‌మ‌నేని

వివాదాల చుట్టూ ఆయ‌న పొలిటిక‌ల్ లైఫ్ సాగుతోంది.. ఇసుక వివాదంలో ఎమ్మార్వో వ‌న‌జాక్షి పై దాడి నుంచి దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ పై విమ‌ర్శ‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఇటీవ‌ల జైలు శిక్ష ప‌డినా ఆయ‌న వైఖ‌రిలో ఎటువంటి మార్పు రాలేద‌ని విమ‌ర్శ‌లు మ‌రింత ఎక్కువ‌య్యాయి...టీడీపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తీరు ఇప్పుడు మ‌రింత చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.   
 
తాజాగా ఆర్టీసీ సిబ్బందిపై విరుచుకుపడ్డారు చింత‌మ‌నేని.. బస్సుపై ఉన్న చంద్రబాబు ఫొటో ఎందుకు చిరిగిందంటూ డ్రైవర్, కండక్టర్‌లను నడిరోడ్డుపైనే దుర్భాషలాడుతూ చిందులు వేశారు. ఇదేమిటని ప్రశ్నించిన ఓ వ్యక్తిపై దాడి చేశారు. దీంతో కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. 
 
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్ర‌భాక‌ర్ అభయాంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చారు. అదే సమయంలో నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జంక్షన్‌ సెంటర్‌ నుంచి గుడివాడ వైపు వెళుతోంది.అయితే ఆ బస్సుపై అతికించిన ప్రభుత్వ ప్రచార పోస్టర్‌లోని సీఎం ఫొటో కాస్త చిరిగి ఉండటంతో చింతమనేని వెంటనే తన మనుషులను పంపించి బస్సును అడ్డగించారు.
 
డ్రైవ‌ర్ కండెక్ట‌ర్ పై చింత‌మ‌నేని ఫైర్ అయ్యారు ప్ర‌భుత్వ సొమ్ము తింటూ సీఎం ఫోటో చిరిగితే అతికించాలి అని తెలియ‌దా అని దూష‌ణ‌లు చేశారు.. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానికుడు గరికపాటి నాగేశ్వరరావు(చంటి) ప్రభుత్వ ఉద్యోగులతో ఇదేం వైఖరి అంటూ చింతమనేనిని ప్రశ్నించాడు. దీంతో ఆయన మరింత రెచ్చిపోయి.. నాగేశ్వరరావుపై ఏడాపెడా చేయి చేసుకోవడంతో అక్కడున్నవారు అవాక్కయ్యారు.
 
 
దీంతో ఆయ‌న మ‌ద్ద‌తు దారులు వ‌చ్చి జాతీయ‌ర‌హ‌దారిపై ఆందోళ‌న చేశారు అన్యాయం చేస్తే ప్ర‌శ్నించ‌కూడ‌దా ఎమ్మెల్యే వైఖ‌రి ఏమిటి అని నిల‌దీశారు... చింతమనేనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. వీరికి కాపు సంఘం, వైఎస్సార్‌సీపీ నాయకులు మద్దతు పలికారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వి.సతీశ్‌ ఘటనాస్థలికి చేరుకుని సర్ది చెప్పడంతో నిరసనకారులు ఆందోళన విరమించారు.
 
చింతమనేనిపై చర్యలు తీసుకోకపోతే మళ్లీ ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. ఇక సీఎం చంద్ర‌బాబు కూడా గ‌తంలో ఆయ‌న వైఖ‌రిపై నోరుమొద‌ప‌లేదు.. ఆయ‌న పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో ఇప్పుడు అంద‌రూ ఇదే చ‌ర్చించుకుంటున్నారు సీఎం కూడా చింత‌మనేని వ్య‌వ‌హారం పై ఎందుకు మాట్లాడ‌టం లేదు అని ప్ర‌శ్నిస్తున్నారు..?

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.