వైఎస్ జ‌గ‌న్ కు చిరంజీవి ఫోన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan and chiranjeevi
Updated:  2018-10-27 05:32:21

వైఎస్ జ‌గ‌న్ కు చిరంజీవి ఫోన్

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని విశాఖ ఎయిర్ పోర్ట్ లో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు హ‌ర్ష‌వర్ద‌న్ కు చెందిన క్యాంటిన్‌ల్ లో ప‌ని చేస్తున్న శ్రీనివాస‌రావు కోడి పందాలకు వాడే క‌త్తితో జ‌గ‌న్ ను పొడిచిన సంగ‌తి తెలిసిందే. ఈ హ‌త్యాయ‌త్నంలో తీవ్రంగా గాయ‌ప‌డిన జ‌గ‌న్ హైద‌రాబాద్ లో న్యూరో సిటి ఆసుప‌త్రిలో 24 గంట‌ల‌పాటు చికిత్స తీసుకున్నారు. 
 
ఆ త‌ర్వాత డిశ్చార్జ్ అయి లోట‌స్ పాండ్‌లోని త‌న నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ప‌రామర్శించేందుకు చిత్ర‌పరిశ్ర‌మ‌కు చెందిన న‌టీన‌టులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ‌కీయ నాయ‌కులు కూడా ఆయ‌న‌కు ఫోన్ చేసి ప‌రామ‌ర్శిస్తున్నారు. ఇదే క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు, మెగ‌స్టార్ చిరంజీవి కూడా జ‌గ‌న్ కు ఫోన్ చేసి అత‌ని ఆరోగ్య ప‌రిస్థితుల‌ను అడిగి తెలుసుకున్నారు. 
 
అంతేకాదు ఆయ‌న త‌ర్వ‌గా కోలుకోవాల‌ని రాష్ట్ర వ్యాప్తంగా ఆయా మ‌తాల‌కు చెందిన వారు వారివారి దేవుళ్ల‌కు ప్ర‌త్యేక పూజ‌లు చేస్తున్నారు. కాగా ఇప్ప‌టికే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్, జ‌గ‌న్ పై జ‌రిగిన హత్యాయ‌త్నంపై ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమ‌ర్శ‌లు చేశారు. అలాగే పార్టీ త‌ర‌పున ప‌వ‌న్ ఒక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేశారు.  

షేర్ :

Comments

0 Comment