చిరు రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం పై క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chiranjeevi
Updated:  2018-10-16 02:56:19

చిరు రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం పై క్లారిటీ

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన హీరో మెగాస్టార్ చిరంజీవి రాజ‌కీయ అరంగేట్రం చేసి ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించిన సంగ‌తి తెలిసిందే. అ త‌ర్వాత ఆయ‌న ఊహించ‌ని ప‌రిణామాల నేప‌థ్యంలో త‌న పార్టీని అమాంతంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అలా పీఆర్పీని విలీనం చేసిన త‌ర్వాత కొంత కాలం పాటు పార్టీలో కేంద్ర మంత్రిగా చురుకుగా కొన‌సాగారు చిరు. ఆ స‌మ‌యంలో తెలంగాణ మూమెంట్ రావ‌డం కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాడం ఇవ‌న్ని చ‌క‌చ‌కా అయిపోయాయి.
 
ఇక ఆ త‌ర్వాత నుంచి చిరంజీవి కేంద్ర‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్నా కూడా మీడియా స‌మావేశాలు ఏర్పాటు చేయ‌కుండా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో చిరంజీవి రాజ‌కీయ భ‌విష్య‌త్ పై రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతారా లేక రాజీనామా చేసి త‌న త‌మ్ముడు స్థాపించిన జ‌సేన పార్టీలో చేరుతారా అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. 
 
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో రాహుల్ గాంధీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తిరిగి రాజ‌కీయ రంగంలోకి దిగాల‌ని స్వ‌యానా కోరినా ఇందుకు చిరంజీవి స్పందించ‌న‌ట్లు తెలుస్తోంది. అయితే విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం చిరంజివీ రాజ‌కీయాల‌కు గుడ్ భై చెప్పి పాత జీవితం సినిమాల‌కు ప‌రిమితం అవుతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నా