జ‌న‌సేన లోకి చిరు అక్క‌డి నుంచే పోటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-10 13:44:47

జ‌న‌సేన లోకి చిరు అక్క‌డి నుంచే పోటీ

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌తో పాటు జ‌న‌సేన పార్టీ నాయ‌కులు కూడా విసృతస్థాయిలో ప్ర‌చారం చేస్తున్నారు. 2019లో జ‌న‌సేన త‌రుపున ఎలాగైనా అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టి అధికార నాయ‌కుల‌కు త‌న రుచిని చూపించాల‌ని ప‌వ‌న్ వ్యూహ‌లు ర‌చిస్తున్నారు. 
 
అయితే పార్టీ ఆవిర్భావం నుంచి కేవ‌లం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్ర‌మే రాష్ట్ర వ్యాప్తంగా ఒంటెద్దు పోరాటం చేస్తున్నారు. ఆయ‌న‌కు ఫ్యామిలీ త‌రుపున ఎటువంటి స‌పోర్ట్ లేదు.  గతంలో ప‌వ‌న్ భ‌హిరంగంగానే చిరు ఫ్యామిలీపై కొన్ని వ్యాఖ్య‌లు చేయ‌డం వ‌ల్ల ఫ్యామిలీల మ‌ధ్య కోల్డ్ వార్‌ జ‌రిగింది. దీంతో ప్ర‌తీ ఒక్క‌రు చిరు ఫ్యామిలీ జ‌న‌సేన పార్టీకి దూరం అవుతార‌నే భావించారు.
 
అయితే ఊహించ‌ని పరిణామాల నేప‌థ్యంలో చిరు ఫ్యామిలీ, అలాగే నాగ‌బాబు ఫ్యామిలీలు జ‌న‌సేన‌కు జై కొట్ట‌నున్నార‌ని తెలుస్తోంది. ఈ విష‌యంపై అన్న‌య్య చిరు, నాగ‌బాబు తీవ్ర‌మైన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ప‌వ‌న్ ఒక్క‌డే పార్టీని ముందుకు సాగించ‌లేరని భావిస్తున్నార‌ట‌. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు కుల‌స్తుల ఓట్లను రాబ‌ట్టాలంటే ప‌వ‌న్ వ‌ల్ల సాధ్యం కాదని భావించి వారు త‌ర్వ‌లో జ‌న‌సేన‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
ఒకవేళ‌ ఈ వార్త నిజం అయితే వ‌చ్చే ఎన్నికల్లో చిరుకు ప‌వ‌న్ కాపు ఓట్లు ప్రావిణ్యం జిల్లాల్లో జ‌న‌సేన త‌రుపున ఎంపీగా పోటీ చేయించ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం తూర్పు గోదావ‌రి, లేక ప‌శ్చిమ గోదావ‌రిజిల్లాల్లో చిరును ఎంపీగా పోటీ చేయిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కాగా ఇప్ప‌టికే చిరు కాంగ్రెస్ హ‌యాంలో ఢిల్లీ రాజ‌కీయాల‌పై మంచి ప‌ట్టు సాధించారు. ఇక చిరు పార్టీలో చేరిన త‌ర్వాత నాగ‌బాబు ఎంట్రీ ఉంటుంద‌ని తెలుస్తోంది. ఆయ‌న పార్టీలో చేరితే పార్టీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.