చిరు గ్రీన్ సిగ్న‌ల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-15 02:48:03

చిరు గ్రీన్ సిగ్న‌ల్

ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్  పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రి బాధ్య‌త‌లు నిర్వ‌హించిన మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు. దేశంలో ఇప్పుడు భార‌తీయ జ‌న‌తా పార్టీ హ‌వా కొన‌సాగుతోంది. బీజేపీపై వ్య‌తిరేక‌త వ‌చ్చేంత వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీకి పూర్వ‌వైభ‌వం రావ‌డం క‌ష్టం.. ఏపీ విష‌యానికి వ‌స్తే కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయింద‌నే చెప్పాలి.. ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆ పార్టీని ఆద‌రించ‌డం సాధ్యం.
 
దీంతో చిరంజీవి ఎంపీగా కొన‌సాగుతూనే  తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో  రీ ఎంట్రీ ఇచ్చారు.  సినిమాలు చేస్తున్న చిరు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు మాత్రం కాస్త దూరంగా ఉన్నార‌నే చెప్పాలి. అయితే బీజేపీని ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు చిరు అవ‌స‌రం వ‌చ్చింది. 
 
త్వ‌ర‌లో క‌ర్ణాట‌క శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. అక్క‌డ  మ‌రోసారి గెలిచేందుకు  కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ర‌చిస్తోంది. ఇందులో భాగంగానే క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధుల త‌ర‌పున  చిరంజీవితో ప్ర‌చారం చేయించేందుకు సిద్ద‌మ‌య్యారు. 
 
చిరుతో పాటు సినీ న‌టి ఖుష్బూ కూడా ఎన్నిక‌ల ప్ర‌చారం చేయ‌నున్నారు. ప్రియాంక గాంధీతో కూడా ప్ర‌చారం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే ప్రియాంక ఇందుకు సానుకూలంగా  స్పందించ‌లేద‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.