బాబు సొంత జిల్లాలో వైసీపీలోకి భారీ చేరిక‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-13 18:43:54

బాబు సొంత జిల్లాలో వైసీపీలోకి భారీ చేరిక‌లు

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న తరుణంలో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి అధికారంలోకి రావాల‌నే ఉద్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా త‌న అనుకూల ఎల్లో మీడియాతో స‌ర్వేల‌ను నిర్వ‌హిస్తున్నారు.
 
ఈ స‌ర్వే ప్ర‌కారం ఏ జిల్లాలో అయితే టీడీపీ ప‌ట్టు త‌క్కువ‌గా ఉంద‌ని తేలితే ఆ జిల్లాలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు టీడీపీ ఎమ్మెల్యేల‌తో దృష్టి సారిస్తున్నారు. అయితే ఈ క్ర‌మంలో టీడీపీ అధిష్టానానికి దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో అధికార తెలుగుదేశంపార్టీకి చెందిన కీల‌క నాయ‌కులు ప్ర‌తిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
 
ఈ జిల్లాలో టీడీపీ ప‌ట్టు అంతంత మాత్రంగానే ఉన్న నేప‌థ్యంలో... పార్టీలో ఉన్న నాయ‌కులు కూడా ప్ర‌తిప‌క్ష పార్టీలోకి చేరుతున్నారు. అయితే టీడీపీ కార్య‌క‌ర్త‌లను  పార్టీలో చేర్పించ‌డానికి పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీల‌క భాద్య‌త‌ల‌ను తీసుకున్నారు. ఇక వారు పార్టీలో చేరిన త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, 2019లో ఖ‌చ్చితంగా ప్ర‌తిపక్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అవ్వ‌డం ఖాయం అని స్ప‌ష్టం చేశారు. జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన త‌ర్వాత బీసీ గ‌ర్జ‌న ఏర్పాటు చేస్తామ‌ని రామచంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు. 
 
టీడీపీ అధికారంలోకి వ‌స్తే త‌మ జిల్లాను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అభివృద్ది చేస్తాడ‌ని భావించి 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీకి ఓట్లు వేస్తే  చిత్తూరు జిల్లా ప్ర‌జ‌ల‌ను నిలువునా ముంచార‌ని వైసీపీలో చేరిన టీడీపీ కార్య‌క‌ర్త‌లు మండిప‌డ్డారు.  

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.