వైసీపీలోకి రీ ఎంట్రీ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-31 16:15:25

వైసీపీలోకి రీ ఎంట్రీ ?

ఇంకా ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మ‌యం ఉంది అయితే ఇప్ప‌టి నుంచే ఎన్నిక‌ల వేడి రాజుకుంది ఏపీలో ...మ‌రీ ముఖ్యంగా వైసీపీ తెలుగుదేశం పార్టీలు ప్ర‌ధాన రాజ‌కీయ వైరి పార్టీలుగా సాగుతున్నాయి... ఇటు జ‌న‌సేన కూడా మ‌రో ఏడాది స‌మ‌యం ఎన్నిక‌లకు ఉన్నా ఎటువంటి రాజ‌కీయ అడుగులు ముందుకు వేయ‌డం లేదు, ఇటు జ‌గ‌న్ పాద‌యాత్ర ప‌శ్చిమ తూర్పుగోదావ‌రి జిల్లాలో మీదుగా ఉత్త‌రాంధ్రాకు చేరుకోనుంది. ఇక ఇప్పుడు తాజాగా విశాఖ‌లో టిక్కెట్ల ఫీవ‌ర్ న‌డుస్తోంది.
 
విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్థానం ఉంది.... 2014లో పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించింది తెలుగుదేశంపార్టీ ..ఇక వైసీపీ త‌ర‌పున చొక్కాకుల వెంక‌ట‌రావు బ‌రిలోకి దిగారు... కాని ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి చెంది బీజేపీకి  విజ‌యం వ‌రించింది.. తెలుగుదేశం బీజేపీ క‌లిసి ఏపీలో పాల‌న సాగించాయి నాలుగు సంవ‌త్స‌రాలు.... ఇక విష్ణుకుమార్ రాజు కూడా ఆ అనుబంధ స‌ర్కారులో ఉన్నారు.. అయితే ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ క‌టీఫ్ చెప్పుకోవ‌డం ఎన్డీయే నుంచి తెలుగుదేశం బ‌య‌ట‌కు రావ‌డంతో రాజ‌కీయంగా ఇక్క‌డ సీటు పై ఇప్ప‌టు ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి...
 
ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో చొక్కాకుల ఓడిపోయినా ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కు మంచి సాఫ్ట్ కార్న్ ఉంది.... ఆయ‌న అన్ని పార్టీల నాయకుల‌తో చెలిమిగా ఉంటారు....అయితే 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న వైసీపీ త‌ర‌పున పోటీ చేసి ఓట‌మిపాలైన త‌ర్వాత, బీజేపీలో చేరారు ఆయ‌న‌, ఇక ఇప్పుడు తాజాగా ఆయ‌న వైసీపీలోకి రీ ఎంట్రీ ఇస్తారు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి....ఆయ‌న మ‌ళ్లీ వైసీపీలో చేరి వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యానికి కృషి చేస్తాను అని చెబుతున్నార‌ట‌.
 
అయితే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కూడా ఈ విష‌యం తెలియ‌చేశార‌ని తెలుస్తోంది....ఇటు విశాఖ పాద‌యాత్ర చేరిన స‌మ‌యంలో ఆయ‌న పార్టీలోచేరే అవ‌కాశం ఉంది అని  కొన్ని వార్త‌లు వినిపిస్తున్నాయి.... దీనిపై పార్టీ స‌మ‌న్వ‌య‌కర్త‌లు అయిష్ట‌త‌గా ఉన్నారు అని తెలుస్తోంది....విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ముగ్గురు సమన్వయకర్తలు ఉన్నారు.... సత్తి రామకృష్ణారెడ్డి.. సనపల చంద్రమౌళి.. పసుపులేటి ఉషాకిరణ్‌లు ప్రస్తుతం ఆ బాధ్యతలను మోస్తున్నారు.
 
గ‌తంలోనే  ఆయ‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లారు కాబట్టి,  గ‌త కొన్ని ఏళ్లుగా పార్టీ  బాధ్య‌త‌లు ఇక్క‌డ చూసుకుంటున్నామ‌ని ఇప్పుడు ఆయ‌న‌కుమ‌ళ్లీ అవ‌కాశం ఎలా ఇస్తారు అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు అని తెలుస్తోంది.ఆయ‌న్ని పార్టీలోకి తీసుకున్నా ఆయ‌న‌కు మాత్రం టిక్కెట్టు ఇవ్వ‌ద్దు అని ష‌ర‌తులు పెడుతున్నార‌ని జిల్లా శ్రేణులు చ‌ర్చించుకుంటున్నారు.....మొత్తానికి జ‌గ‌న్ ఈ ఇష్యూకి ఎలా ఫుల్ స్టాప్ పెడ‌తారా అనేది చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.